న్యూఢిల్లీ / చిత్తూరు అక్టోబర్ 7( గరుడ దాత్రి న్యూస్) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు ఏపీ కూటమి ఎంపీల బృందంతో కలసి
చిత్తూరు పార్లమెంటు సభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు సాదర స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావుమాట్లాడుతూ
1రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ పర్యటన:
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఢిల్లీ పర్యటన రాష్ట్రానికి మేలు చేసే పర్యటనేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, సంస్థల విషయంలో సానుకూల ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతుందని తెలిపారు2.కూటమిఐక్యతకునిదర్శనం:విమానాశ్రయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎంపీలు కలిసి ముఖ్యమంత్రికి స్వాగతం పలకడం కూటమి ఐక్యతకు, సమన్వయానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల సమగ్రాభివృద్ధి విషయంలో కేంద్ర సహకారం కోరే విషయంలో ఎంపీలందరం ఐక్యంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.
3.చిత్తూరు జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిముఖ్యమంత్రి దృష్టికి చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మ్యాంగో బోర్డ్ ఏర్పాటు ప్రతిపాదన వంటి పెండింగ్ అభివృద్ధి అంశాలు, కేంద్ర సహకారం అవసరమైన ప్రాజెక్టులను తీసుకెళ్తామని ఎంపీ తెలిపారు. ముఖ్యంగా మదనపల్లెలో శంకుస్థాపన చేసిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కు కేంద్రం నుండి మరింత సహకారం అందించేలాకృషిచేస్తామన్నారు.ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన విజయవంతం కావాలని, రాష్ట్రానికి మరిన్ని మంచి ఫలితాలు రావాలని ఆకాంక్షిస్తున్నట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలిపారు.
