ePaper
Thursday, October 8, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిప్రతి ఇంటి ముందు.. రోడ్డు, వీధి లైట్లు, నీటి పైపులైన్..

ప్రతి ఇంటి ముందు.. రోడ్డు, వీధి లైట్లు, నీటి పైపులైన్..

📰 Generate e-Paper Clip

అభివృద్ధి కోసమే పని చేస్తా

రూ.3.17 కోట్లతో సంతపేట
చవటపల్లి రోడ్డు ప్రారంభం

—ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

చిత్తూరు అక్టోబర్ 7(గరుడ రాత్రి న్యూస్) చిత్తూరును అభివృద్ధి చేయడానికి వచ్చానని.‌. అభివృద్ధి కోసమే పని చేస్తానని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ స్పష్టం చేశారు. అభివృద్ధి కోసం పని చేస్తుంటే.. కొంతమంది చిల్లర రాజకీయాలు చేస్తూ.. అభివృద్ధికి ఆటంకాల సృష్టిస్తున్నారన్నారు. చిత్తూరు సంతపేట, చవటపల్లి ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రోడ్డు కలను నిజం చేస్తూ రూ.3.17 కోట్లతో నిర్మించిన సిమెంట్ రోడ్డును బుధవారం ఎమ్మెల్యే, కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. అంతకుముందు ఇదే రోడ్డులో రూ.23.60 లక్షల చుడా నిధులతో నిర్మించిన స్ట్రామ్ వాటర్ డ్రైన్, సిమెంట్ కాలువను చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా 49వ స్వర్ణ వార్డు సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిత్తూరు చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. తాను రాజకీయాల కోసం చిత్తూరు రాలేదని.. కేవలం అభివృద్ధి చేయడానికి వచ్చానని, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో నిధులు తెచ్చి చిత్తూరు అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధి పనులను చూసి ఓర్వలేని వైకాపా నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తూ, అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, వారి మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని గుర్తించాలన్నారు. గురజాల జగన్ మోహన్ చెప్పారంటే అది చేసి తీరుతానని నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. చిత్తూరు నగరంలోని అన్ని ప్రధాన రహదారులను విస్తరించి అభివృద్ధి చేస్తున్నామని.. అభివృద్ధి చేసే వారికి, మంచి చేసే కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా నిలవాలన్నారు. నగరంలో ప్రతి ఇంటి ముందు సిమెంట్ రోడ్డు, వీధి దీపాలు, నీటి పైప్లైన్లు ఏర్పాటు చేసే దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో కమిషనర్ పి నరసింహ ప్రసాద్, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, మాజీ ఎమ్మెల్యే ఎఎస్ మనోహర్, పరిశీలకులు కుమారి, కూటమి నాయకులు సీకే లావణ్య, వరుణ్ కుమార్, మోహన్ రెడ్డి, క్లస్టర్, డివిజన్ ఇన్చార్జులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!