బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు1
ఈ నెల1 నుండి 7 తేది వరకు జరిగే తల్లి పాలు వారోత్సవాల సందర్భంగా తీర్థం పి.హెచ్.సి. వైద్యాధికారిణి సుస్మిత మేడమ్ ఆద్వర్యంలో తీర్థం పీహెచ్ సి ,అంగన్వాడీ సెంటరు వారు ఆధ్వర్యంలో ర్యాలి మరియు అవగాహన కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిిగింది. ఈ సందర్భంగా సుస్మిత మాట్లాడుతూ తల్లిపాలు శిశువుకు తో లి టీకా, తొలి రక్షణ,తొలి ప్రేమ అని బిడ్డపుట్టిన గంటలోపే తల్లి పాలు ఇ వ్వాలని, ఆరునెలల పాటు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలని,తల్లిపాలు తల్లికి, బిడ్డకు మద్య ప్రేమ మరింత బలపరుస్తుందని అన్నారు. తల్లిపాలు ప్రకృతి ప్రసాదించిన సంపూర్ణ ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది అలాగే రోగ నిరోధక శక్తి అనిచెప్పారు. అలాగేడిప్యూటీ హెచ్.ఈ.ఓ. కాంతమ్మ మాట్లాడుతూ తల్లి పాలు వలన బిడ్డకు సమృద్ధిఆహారం,
వ్యాధుల నుండి రక్షణ, బిడ్డకోరుకున్నప్పుడు దొరుకు తాయి, కల్తీ లేని వి ప్రేమ ఆప్యాయత అనుభందం,అనురాగం, కలుగుతాయి, బిడ్డపెరుగుదల ,
అభివృద్ధికి తోడ్పడుతుంది అందుకే ప్రతి త ల్లి బిడ్డకు పాలు 6నెలల వరకు ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఈకార్యక్రమంలో పి.హెచ్.ఎన్ .శమంతక, హెచ్.ఎస్.
తిరుమలమ్మ, లక్ష్మి, సావిత్రి ప్రతిమ, రాజారెడ్డి, అంగన్వాడీలు మాధవి, మంజుల ఆశ తదితరులు పాల్గొన్నారు.
