ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్రెండు సంవత్సరాలలో మండలం అభివృద్ధి పై కరపత్రాలను ఇంటింటికీ అందజేసిన నాయకులు

రెండు సంవత్సరాలలో మండలం అభివృద్ధి పై కరపత్రాలను ఇంటింటికీ అందజేసిన నాయకులు

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం ఆగస్టు 1 గరుడదాద్రి న్యూస్

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వి ఎం థామస్ వారి సూచనలమేరకు రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం ఇంటింటా ప్రచార కార్యక్రమంలో భాగంగా కార్వేటినగరం మండలం ఎం ఎం విలాసం గ్రామపంచాయతీ ఎం కృష్ణాపురం గ్రామంలో ఇంటింటా కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ పరిశీలకులు జయప్రకాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు మరియు నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు వారికి వివరించారు, గడిచిన రెండు సంవత్సరాలలో కూటమిపాలన అభివృద్ధి సంక్షేమ ఫలాలను వివరించి అర్హులైన రైతులు ప్రజలు ఇబ్బంది పడకుండా తక్షణమే అన్ని సమస్యలన్నిటిని పరిష్కరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు నగలపాటి నాగేశ్వర రాజు, కార్వేటినగరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎం చెంగల్రాయ యాదవ్, వెంకటేష్ మందడి , చంద్రమౌళి రెడ్డి ,నాగభూషణ్ రెడ్డి ,మాధవరెడ్డి ,రవిరాజు ,
చిరంజీవి ,జనార్ధన్ , సెల్వన్ ,పీవీ రుద్రయ్య , పాపయ్య తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!