తిరుపతి, సెప్టెంబర్ 13 గరుడ దాత్రి న్యూస్ : ఈ నెల 15,16 తేదీలలో గౌ. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడానికి జిల్లాకు రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లు, బందోబస్తు విషయంలో చిన్నపాటి లోపాలకు కూడా తావివ్వరాదని జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవింద రావు, మునిసిపల్ కమీషనర్ ఎమ్. జయకృష్ణ లతో కలిసి జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు.
ఆదివారం రేణిగుంట ఎయిర్పోర్ట్ నందు ముందస్తు భద్రత ఏర్పాట్లు లో భాగంగా జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవింద రావు, నగర పాలక కమీషనర్ ఎమ్. జయకృష్ణ తో కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గౌ. ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్న నేపథ్యంలో ఏర్పాట్లల్లో ఎలాంటి లోపాలకు తావివ్వరాదని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటించే అన్ని ప్రదేశాల్లో కూడా విధులు కేటాయించిన అధికారులు అందరూ కూడా సమన్వయంతో బాధ్యతగా విధులు నిర్వహించాలని తెలిపారు. మెడికల్ క్యాంపు, అంబులెన్స్ ఏర్పాట్లు ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సమన్వయం చేసుకోవాలన్నారు. సేఫ్టీ రూమ్ అధునాతన లైఫ్ సపోర్ట్ ఫైర్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ, ఏపీ ఎస్పీడీసీఎల్ విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని, శానిటేషన్ ఏర్పాట్లు, కాన్వాయ్ వెహికల్స్ ఏర్పాటు, హెలిపాడ్ నందు భద్రత ఏర్పాట్లు, ప్రోటోకాల్ అంశాలు తదితర విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పి ఎల్ సుబ్బరాయుడు తో కలిసి పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డిఓ రామ్మోహన్, అడిషనల్ ఎస్ పి లు రవిమనోహర్ అచ్చారి,శ్రీనివాస రావు, శ్రీనివాసులు, డి ఎం అండ్ హెచ్ ఓ బాలకృష్ణ నాయక్, ఆర్ అండ్ బి ఎస్ ఈ రాజా నాయక్, జిల్లా రవాణా అధికారి మురళి మోహన్, ఎయిర్పోర్ట్ అధికారి భూమినాధన్, జిల్లా అధికారులు,DSPలు, CIలు, SIలు మరియు భద్రత, విభాగాల అధికారులు పాల్గొన్నారు
