బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు7
బైరెడ్డిపల్లి మండలం లోని దాసార్లపల్లిలో శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా విషజ్వరాలు ప్రబలకుండా గ్రామములో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మురికినీటి కాలువలు,గుంతలు, శుభ్రం చేసి, వీధులను శుభ్రం చేపట్టారు. దోమలు కుట్ట కుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆరోగ్య సిబ్బంది పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో సెక్రటరీ వినోద్ కుమార్ ,డిప్యూటీ హెచ్.ఈ.ఓ కాంతమ్మ, ఏ.ఎన్. ఎం.కవిత, ఆశ రామాంజీనమ్మ తదితరులు పాల్గొన్నారు.
