–తంబళ్ళపల్లె మంజూరైన ట్రాన్స్ ఫార్మర్ లు పుంగనూరుకు తరలించావు…!!
–తంబళ్ళపల్లె నియోజకవర్గంలోని ప్రకృతి సంపదను దోచుకున్నావు…!!
–ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిపై బుక్కే మనోహర్ నాయక్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్టి సెల్ కార్యదర్శి ధ్వజం
తంబళ్ళపల్లె నియోజకవర్గంలోఅరాచకాలు,విధ్వంశాలు చేసి అభివృద్ధి మరిచిన పార్టీ గత వైస్సార్ ప్రభత్వమని తంబళ్ళపల్లె నియోజకవర్గ నాయకుడు మనోహర్ నాయక్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి గారు తంబళ్ళపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి పై ధ్వజం ఎత్తారు.
తంబళ్ళ పల్లి నియోజవర్గం పెద్దమండ్యం రామానాయక్ తండా మనోహర్ నాయక్ వారి స్వగ్రాంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మనోహర్ నాయక్ మాట్లాడుతూ అభివృద్ధి ని పక్కన బెట్టి ప్రకృతి సంపదను దోచిన నువ్వు మా నాయకులు నారా చంద్రబాబునాయుడు , నారా లోకేష్ పై మాట్లాడే అర్హత లేదన్నారు.నియోజకవర్గంలో దొంగ ఓట్లతో గెలిచిన నువ్వు సామాన్య కార్యకర్తపై నిలబడినా ఓటమి పాలవుతావని అన్నారు.
నియోజకవర్గంలో మంజూరు అయిన సబ్ స్టేషన్ లు పుంగనూరుకు తరలించిన నువ్వు తంబళ్ళపల్లె అభివృద్ధి పై మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు.రాష్ట్రంలో వైసీపీ అరాచక, విధ్వంసక పాలనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో చరమగీతం పాడి విజయవంతంగా రెండేళ్లు పూర్తయిందని అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని పరదాల మాటున బంధించి, ఆలయాలు, కులాలు, మతాలపై దాడులు చేస్తూ, కక్షసాధింపులు మరియు రాజకీయ వేధింపులతో భయాందోళనలు సృష్టించిన ఆ రాక్షస పాలనకు ప్రజలు తమ ఓటు హక్కుతో సరైన గుణపాఠం చెప్పారని అన్నారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి…రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలతో పాటు ప్రతి వర్గాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన గత వైసీపీ ప్రభుత్వానికి ముగింపు పలికిన చారిత్రాత్మక తీర్పు అని అన్నారు.
పరిశ్రమలను భయపెట్టి తరిమేయడం వల్ల రాష్ట్రం వేల కోట్ల పెట్టుబడులను, లక్షలాది ఉద్యోగ అవకాశాలను కోల్పోయిందని అన్నారు. పరిశ్రమలను భయపెట్టి తరిమేసిన పాలన మీది అయితే.. రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొచ్చే పాలన మాది, “బోథ్ ఆర్ నాట్ సేమ్ ” మిస్టర్ జగన్ రెడ్డి” అని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ప్రజల ఆశీర్వాదాలు, కేంద్ర ప్రభుత్వ సహకారం,ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంపూర్ణ మద్దతుతో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తిరిగి అభివృద్ధి బాటలో పయనిస్తోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, అనుభవం మరియు సమర్థ నాయకత్వంతో రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు యువనేత మంత్రి నారా లోకేష్ దేశ విదేశాల్లో పర్యటిస్తూ పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉపాధి కల్పించే దిశగా నిరంతరం కృషి చేస్తున్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనతో నవ్యాంధ్ర పునర్నిర్మాణం అత్యంత వేగంగా జరుగుతోంది.
గత పాలన విధ్వంసానికి ప్రతీక అయితే… నేటి కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలనకు ప్రతీకగా నిలుస్తోంది.ఆంద్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్న ఈ అభివృద్ధి యాత్రలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రామా నాయక్ తాండ గ్రామ కమిటీ అధ్యక్షుడు బి.మోహన్ నాయక్ తెలుగుదేశం పార్టీ నాయకులు, మహేంద్ర నాయక్ అంజనప్ప నాయక్ బి.నారాయణ నాయక్ నాగేంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.
