ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్నాగలాపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల గణవిజయం

నాగలాపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల గణవిజయం

📰 Generate e-Paper Clip

*నాగలాపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల గణవిజయం*

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ విడుదల చేసిన 2026 పదవ తరగతి ఫలితాల్లో నాగలాపురం పీఎం శ్రీ గవర్నమెంట్ హై స్కూల్ ప్లస్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి గణనీయమైన విజయం సాధించారు.

ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి బాబయ్య ఆనందం వ్యక్తం చేశారు.

ఇటీవల నిర్వహించిన పదవ తరగతి పరీక్షల్లో ఈ పాఠశాల 83 శాతం ఉత్తీర్ణత నమోదు చేయడం విశేషం.

ఇందులో ప్రథమ స్థానంలో ఎం. దర్శిని 564 మార్కులు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. ద్వితీయ స్థానంలో కే. రాజేశ్వరి 559 మార్కులతో మెరుగైన ప్రతిభ ప్రదర్శించింది.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని ఈ ఫలితాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా విద్యార్థులు రాణించడం గర్వకారణమని తెలిపారు.

విద్యార్థుల విజయానికి కృషి చేసిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందాన్ని తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఇంకా ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!