టీడీపీ అభ్యర్థిపై వైసిపి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ 1,187 ఓట్ల మెజారిటీతో గెలుపు
తిరుపతి జిల్లా, నాయుడుపేట:
నాయుడుపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తమ్మిరెడ్డి రాజేశ్వరమ్మ విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థిపై 1,187 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఈ విజయంతో నాయుడుపేట పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ శ్రేణులు ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటూ విజయోత్సాహాన్ని పంచుకుంటున్నారు.
తంబిరెడ్డి రాజేశ్వరమ్మకు లభించిన ఈ విజయంపై వైసీపీ నాయకులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ, ఓటు వేసి ఆదరించిన పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 1187 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం నాయుడుపేట రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
