ePaper
Wednesday, November 4, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినాగలాపురం బజారులో ఎన్నికల ప్రచార సందడి

నాగలాపురం బజారులో ఎన్నికల ప్రచార సందడి

📰 Generate e-Paper Clip

– మహిళలు, యువత భారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం
ముఖ్య అతిథులుగా సత్యవేడు నియోజకవర్గ ఇన్‌చార్జి కూరపాటి శంకర్ రెడ్డి

నాగలాపురం, గరుడ ధాత్రి న్యూస్:

నాగలాపురం మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. మంగళవారం తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే హేమలతకి, అలాగే 10 ఎంపీటీసీ సెగ్మెంట్ల అభ్యర్థులకు మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాగలాపురం బజారు వీధుల్లో మహిళా కార్యకర్తలు, మహిళా నాయకులు, యువ నాయకులు ఉత్సాహంగా బైక్ ర్యాలీ నిర్వహించి అభ్యర్థులకు ఘన స్వాగతం పలికారు. బైక్ ర్యాలీతో బజారు వీధులు సందడిగా మారాయి. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సత్యవేడు నియోజకవర్గ ఇన్‌చార్జి కూరపాటి శంకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూరపాటి శంకర్ రెడ్డి మాట్లాడుతూ నాగలాపురం మండల టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే హేమలతని అత్యధిక మెజారిటీతో గెలిపించి, తిరుపతి జిల్లా పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టేలా ప్రతి ఒక్క పార్టీ నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఒక దళిత మహిళకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కేలా ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పర్నిత రెడ్డి, శ్రీనివాసులు యాదవ్, పార్దిబన్, అన్బు, సెల్వ కుమార్, రాజమాణికం శెట్టి, భాస్కర్ శెట్టి, ఎండీ కుమార్, నెల్సన్ మండేల, శ్రీనివాసులు నాయుడు, అగ్రికల్చరల్ చైర్మన్ జోన్సన్, మహిళా నాయకులు, యువ నాయకులు, గ్రామస్థాయి పార్టీ ప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!