శ్రీకాళహస్తి ఆగస్టు 02 (గరుడ దాత్రీ న్యూస్) : స్వతంత్రం వచ్చి ఏళ్ళు గడిచిన గిరిజనులకు ఇంకా స్వతంత్రం రాలేదు కంప్యూటర్ యుగం వచ్చిన కూడా ఓ పెత్తనం దారుడి కనుసైగల్లో బతకాల్సిన పరిస్థితి నేటికీ నెలకొన్నది. తక్కువ కులంలో పుట్టడమే వీరు చేసిన తప్పేమో తెలియదు కానీ బడుగు బలహీన వర్గాలు పెత్తనం దారుల చేతుల్లో నలిగిపోయి బలి అవ్వాల్సిన పరిస్థితి నెలకొంటుంది. స్వతంత్రం తేవడానికి ఎంతో మంది యోధులు పోరాడారు . బ్రిటిష్ వాళ్ళ నుండి ఎదిరించి పోరాడి స్వతంత్రం తీసుకురాగాలేరే కానీ స్వతంత్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా బడుగు బలహీన వర్గాలకు మాత్రం నేటికీ స్వతంత్రం ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది. పెద్దలు విజిలెస్ మార్టిన్ కమిటీలు పేరుతో గిరిజన కాలనీలలో సమావేశాలు ఏర్పాటు చేసి చట్టాల గురించి చెబుతూ ఉంటారు అయితే ఆ కమిటీలు తెల్ల కాగితాలకే పరిమితమయ్యే కానీ వాళ్ళ జీవితాలను మార్చే దానికి దారి చూపట్లేదు. అయితే ఈ గిరిజన బతుకుల్లో మార్పు రావాలంటే ఏ యోధుడు దిగురావాలో ఏ దేవుడు కరుణించాలో తెలియదు కానీ వారిని ఆదుకునేది ఎవరో మనం వేచి చూడాలి.ఇది ఇలా ఉండగా మనం ఇంతసేపు చెప్పుకుంటున్నది పురాణాల్లో చెప్పుకున్నది కాదండోయ్ .. స్వయంగా కేవీపురం మండలంలోని అంజూరు గిరిజన కాలనీలో జరిగిన కథ..
అంజూరు గిరిజన కాలనీలో మాజీ సర్పంచ్ భర్త దగ్గర అప్పు తీసుకున్నందుకు ఆ అప్పుకోసం బాధితులురాలికి తెలియకుండానే ఉన్న ఇల్లును విక్రయించి చంటిబిడ్డలను సైతం వీధి పాలు చేసిన సంఘటన శనివారం కేవీబీపురం మండలంలో చోటు చేసుకున్నది.
బాధితురాలి కథనం మేరకు వివరాలు ఇలా.. కాలనీకి చెందిన శీనయ్య, నందిని దంపతులకు మూడు సంవత్సరాల లోపు ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. భర్తతో కలిసి గ్రామానికి చెందిన వైకాపా తాజా మాజీ సర్పంచి శ్రీజయ భర్త సురేష్ వద్ద రూ.40 వేలు అప్పు తీసుకుని దానితో పాటు వారి వద్ద ఉన్న నగదుతో పక్కాగృహాన్ని నిర్మించుకుని నివాసం ఉండేవారు. ప్రస్తుతం భర్త చనిపోవడంతో మనస్థాపానికి గురైన గిరిజన మహిళ కొద్దిరోజులు కోడూరులోని ఆమె అమ్మగారి ఇంటికి బాధితురాలు పిల్లలతో కలిసి వెళ్లింది. రూ.40 వేలు అప్పుకోసం వైకాపా నాయకుడు గిరిజన మహిళకు చెందిన పక్కా గృహాన్ని రూ. రెండు లక్షలకు విక్రయించి సొమ్ము వేసుకున్నాడు. సొంతింటికి వచ్చిన బాధితురాలికి ఆమె ఇంటికి తాళం వేసిన ఇల్లు కనిపించడంతో బాధితురాలు ఒక్కసారిగా అవాక్కయింది. నా ఇంటికి నాకు తెలియకుండా నా తాళం తీసివేసి వేరే తాళం వేసింది ఎవరు అని విచారించగా ఆమెకు కొన్ని విషయాలు తెలిసింది. ఆమె ఏమి చేయాలో తెలియక తాళం వేసిన మాజీ సర్పంచ్ భర్త సురేష్ కి ఫోన్ చేయగా ఆయన చెప్పిన మాటలు విని ఆమె గుండెలో బద్దలయ్యాయి వారిని నిలదీయగా అసలు విషయం తెలిసింది. దీనిపై వైకాపా నాయకుడికి ప్రశ్నించిన బాధితురాలు సమాధానం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. రెండు రోజులు గడుస్తున్న తమ గోడుపట్టించుకోవడం లేదని బధితురాలు కన్నీటి పర్యంత మవుతోంది. ఉన్నతాధికారులు స్పందించి చంటిబిడ్డలతో వీధిపాలైన బాధితురాలిని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
నా ఇల్లు ని నాకు ఇప్పించండి అంటూ పోలీసులను ఆశ్రయించిన గిరిజన మహిళ
RELATED ARTICLES
