* పాల్గొనున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
* ఏర్పాట్లు చేపట్టిన అధికార యంత్రాంగం.
* 1,085 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు.
కుప్పం,సెప్టెంబర్ 28 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం నేడు మంగళవారం పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారం చురుగ్గా చేపట్టింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి తారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు పాల్గొంటున్నారు.ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల ముఖచిత్రాన్ని మార్చేలా ప్రతిష్టాత్మక ‘పల్లె పండుగ 3.0’కి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రూ.11,085 కోట్ల అంచనా వ్యయంతో భారీ అభివృద్ధి పనులను నేడు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో రూ.2,700 కోట్లతో 6,000 కి.మీ సీసీ రోడ్లు, రూ.7,550 కోట్లతో 9,500 కి.మీ బిటి రోడ్లు, రూ.300 కోట్లతో 22,000 మిని గోకులాలు, రూ.225 కోట్లతో 50,000 ఎకరాల్లో ఉద్యాన తోటల పెంపకం వంటి అనేక సంక్షేమ, మౌలిక వసతుల పనులను చేపట్టనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నాబార్డ్, గ్లోబల్ హార్టికల్చర్ హబ్ నిధులను అనుసంధానిస్తూ గ్రామ పంచాయతీ భవనాలు, బస్ షెల్టర్లు, డ్రెయిన్ల నిర్మాణంతో పల్లెల్లో పండగ వాతావరణం నెలకొంది.నేడుమధ్యాహ్నం 2:30 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పర్యటించనున్నారు. ఈ పల్లె పండుగ బహిరంగ సభకు కూటమి ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది.హైవేపై 12 కిలోమీటర్ల మేర ఇరువైపులా కూటమి పార్టీల జెండాలతో అలంకరించారు. స్థానిక మంత్రి నారాయణ సభప్రాంగణానికి సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించగా, ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.
