ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్నేటి నుంచి కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన

నేటి నుంచి కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన

📰 Generate e-Paper Clip

3 తేదీ నుంచి 5 తేదీ వరకు మూడు రోజులు పర్యటించనున్న ముఖ్యమంత్రి.
అభివృద్ధి సహా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.
రూ.3847 కోట్ల విలువైన పెట్టుబడులకు శంకుస్థాపనలు చేయనున్న సీఎం చంద్రబాబు.
సీఎం సమక్షంలో రూ.1026 కోట్ల విలువైన పెట్టుబడులకు ఎంఓయూలు.
ఎం.ఎస్. ఎం.ఈ.పార్క్, కడా గెస్ట్ హౌస్ ప్రారంభం, కుప్పం బస్టాండ్, డిపో నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలు.
దాదాపు ఏడాదిన్నర తర్వాత కుప్పం టీడీపీ కార్యాలయాన్ని సందర్శించనున్న ముఖ్యమంత్రి
ఏర్పాట్లు పూర్తిలో అధికార యంత్రాంగం బిజీబిజీ

కుప్పం,జులై 02 (గరుడ ధాత్రి న్యూస్):
రాష్ట్ర ముఖ్యమంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కుప్పం శాసనసభ్యులు నారా చంద్రబాబునాయుడు నేటి నుండి మూడు రోజులపాటు కుప్పం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను అధికార యంత్రాంగం చురుగ్గా చేపడుతుంది. ఏం పర్యటనను విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం బిజీబిజీగా ఏర్పాట్లు చేపడుతున్నది.ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఒప్పందాలు, పార్టీ కార్యక్రమాలు, క్షేత్ర స్థాయి పర్యటనలు. ఇదీ మూడు రోజుల పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షెడ్యూల్. జూలై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. అధికారిక కార్యక్రమాలతోపాటు పార్టీ కార్యక్రమాలలో ప సీఎం చంద్రబాబు మూడు రోజుల పర్యటన సాగనుంది. ఈ పర్యటనలో భాగంగా తొలి రోజు గుడిపల్లె మండలం పొగురుపల్లెలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొత్తంగా రూ.3,847 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టే 12 పరిశ్రమలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కంపెనీల ద్వారా మొత్తంగా 23 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. దీంతో పాటు మరో రూ.1026 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి కుప్పంలో పరిశ్రమలు ఏర్పాటు చేసే వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమక్షంలో అధికారులు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. వీటితో పాటు పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టనున్నారు. అబీస్ ప్రోటీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ ను ప్రారంభించి 200 మందికి ఉద్యోగ నియామక పత్రాలను సీఎం అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రూఫ్ టాప్ సోలార్ నిమిత్తం ఏర్పాటు చేసిన సోలార్ పవర్ ప్లాంట్లను ప్రారంభిస్తారు. అలాగే పీఎంఏవై పథకం కింద నిర్మించిన 5,179 ఇళ్లను లబ్దిదారులకు అందచేస్తారు. అలాగే కుప్పంలో మరిన్ని పరిశ్రమలను ఏర్పాటు చేసే నిమిత్తం పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశం అవుతారు. స్థానికులను ఉద్దేశించి పొగురుపల్లెలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు.
క్షేత్ర స్థాయి పర్యటనలు- వివిధ ప్రాంతాల సందర్శనలు: రెండో రోజున శెట్టిపల్లి, గుట్రాలపల్లి, కంగుంది గ్రామాలతోపాటు కుప్పం మున్సిపాల్టీలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. ఈ క్షేత్రస్థాయి పర్యటనల్లో భాగంగా 44.58 ఎకరాల్లో 167 ఇండస్ట్రీయల్ ప్లాట్లతో ఏర్పాటు చేసిన ఎం ఎస్ ఎం ఈ పార్క్ ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అలాగే కడా గెస్ట్ హౌస్ ను ప్రారంభిస్తారు. కుప్పం బస్టాండ్, డిపో నిర్మాణాలకు శంకుస్థాపనలు చేపట్టనున్నారు. శెట్టిపల్లిలోని నెట్ జీరో విధానాన్ని అనుసరిస్తున్న ఇళ్లను పరిశీలిస్తారు. కుప్పం ఏరియా ఆస్పత్రిని సందర్శించి ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటి,ఆస్పత్రిలో సీటీ స్కానింగ్, డయాలసిస్ సెంటర్లను ప్రారంభించనున్నారు. అలాగే కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. దాదాపు ఏడాదిన్నర క్రితం కుప్పం కార్యాలయాన్ని సందర్శించిన సీఎం సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ పార్టీ కార్యాలయానికి వెళ్లి జన నాయకుడు పేరుతో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొంటారు. కంగుంది గ్రామంలో నిరుపేదలకు అసైన్మెంట్ పట్టాలను అందిస్తారు. అలాగే కుప్పం మాస్టర్ ప్లాన్, స్వర్ణ కుప్పం విజన్ – 2029 డాక్యుమెంట్ రూపకల్పనపై అధికారులతోనూ ఐఐటీ కాన్పూర్ ప్రతినిధులతో చర్చిస్తారు. కుప్పం స్థానిక నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గొంటారు. రెండో రోజున కుప్పం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
కుప్పం టీడీపీ సంస్థాగత వ్యవహారాలపై సమీక్ష:కుప్పంలో మూడో రోజు పర్యటనలో పార్టీ కార్యక్రమాలతో పాటు శాంతిపురం, గుడిపల్లె మండలంలో వివిధ క్షేత్ర స్థాయి పర్యటనలు చేపట్టనున్నారు. కుప్పంలోని ముఖ్యనేతలు మొదలుకొని బూత్ స్థాయి కార్యకర్తలతో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. కుప్పం నియోజకవర్గంలోని పార్టీ సంస్థాగత వ్యవహరాలపై స్థానిక నేతల నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు. అలాగే పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు,సర్ వంటి అంశాలపై నేతలకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారు. అలాగే పీ4 కార్యక్రమంలో భాగంగా పలువురు బంగారు కుటుంబాలు, మార్గదర్శులతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. పీ4 కార్యక్రమం అమలుపై చర్చిస్తారు. అలాగే పర్యావరణానికి హాని కలిగించకుండా ఏర్పాటు చేసిన పౌల్ట్రీ షెడ్లను సీఎం సందర్శిస్తారు. ఆదర్శ రైతులను పలకరిస్తారు. వారితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ద్రవిడ యూనివర్శిటీ మీటింగ్ హాల్లో చిత్తూరు జిల్లా అధికారులు, కుప్పం నియోజకవర్గంలో విధులు నిర్వహించే ఉద్యోగులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. ఈ కార్యక్రమంతో కుప్పంలో ముఖ్యమంత్రి మూడు రోజుల పర్యటన ముగుస్తుంది.
ప్రియం పర్యటన విజయానికి అధికారుల కృషి: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మూడు రోజులకు పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్,ఎస్పీ తుషార్ డూడి, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ క్షేత్రస్థాయి పరిశీలనలు,సమీక్షలు నిర్వహించారు. మరో ప్రక్కన ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభలను విజయవంతం చేసేందుకు బూత్ లెవెల్ స్థాయి నుంచి పార్టీ నాయకులు కృషి చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!