ePaper
Sunday, August 9, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్నేడు కొత్తవీరపల్లిలో బాలసుబ్రమణ్య స్వామి ఆలయంలో ఆడికృత్తిక మహోత్సవం

నేడు కొత్తవీరపల్లిలో బాలసుబ్రమణ్య స్వామి ఆలయంలో ఆడికృత్తిక మహోత్సవం

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి ఆగస్టు 05 గరుడ దాత్రి న్యూస్

పెద్దపంజాణి మండలం కొత్త వీరప్పల్లి గ్రామంలో గల యోగ నందీశ్వర స్వామి ఆలయ ఆవరణంలో గల శ్రీ బాలసుబ్రమణ్య స్వామి కి ఈనెల 7న ఆడికృతిక మహోత్సవము నిర్వహించబడునని గ్రామస్తులు తెలియజేశారు శుక్రవారం ఉదయాన్నే ఆలయంలో గణపతి పార్వతి దేవికి శివుడికి పంచామృతాభిషేకం రుద్రాభిషేకం నిర్వహించబడునని అనంతరం స్వామివారికి విషెస్ అభిషేకము జరపబడునున్నారు అదేవిధంగా మేల తాళాలతో మంగళ వాయిద్యాలతో శ్రీ బాలసుబ్రమణ్య స్వామికి కావిల్లు చెల్లింపు పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా జరుపుకుంటున్న అన్నారు కావున భక్తులందరూ విచ్చేసి పవిత్ర తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కావలెనని వారు కోరారు ఈ మేరకు శ్రీ బాలసుబ్రమణ్య స్వామి ఆలయం సర్వాంగ సుందరంగా తీర్చబడుతుంది కొత్త వీరప్పల్లి గ్రామస్తులు ఆధ్వర్యంలో శ్రీ బాలసుబ్రమణ్య స్వామి ఆవరణ నందు పుష్పకావిల్లు చెల్లించే వారికి మౌలిక వసతులతో పాటు భోజన వసతి కల్పిస్తున్నట్లు వివరించారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!