ePaper
Friday, June 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపారిశుద్ధ్య కార్మికుల ఆకలి కేకలు

పారిశుద్ధ్య కార్మికుల ఆకలి కేకలు

📰 Generate e-Paper Clip

-మూడు మాసాలుగా అందని జీతాలు …

-సత్యవేడు మేజర్ పంచాయతీ లో
ఇది సంగతి

గరుడధాత్రి :

సత్యవేడు మేజర్ పంచాయతీ పరిధిలో నెలసరి జీతాలు అందకపోవడంతో అప్పులతో తమ కుటుంబాలను నెట్టుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని పారిశుద్ధ కార్మికులు, ఇతర ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడు లేని విధంగా జీతాల గురించి పట్టించుకునే వారు లేరని ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిత్యవసర వస్తువులు, స్థానికంగా చేసిన అప్పులు ఎలా చెల్లించాలో తెలియక వారు ఇబ్బందులకు గురవుతున్నారు త్వరలోనే పాఠశాలలు ప్రారంభం కానుంది తమ పిల్లల చదువులు కూడా ఎలా సాగించాలో అర్థం కాక వారు తలలు పట్టుకుంటున్నారు తమ తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి ప్రతిరోజు పారిశుధ్యమును చెక్కదిద్దే కార్మికులకు వేతనాలు అందించకపోవడం చాలా బాధించే అంశంగా ఉందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడు లేని విధంగా ఈ పంచాయతీ పరిధిలో ఇతర ప్రాంతాల నుంచి సిబ్బందిని దిగుమతి చేసుకొని స్థానికుల నుంచి ఇంటి పన్ను, మంచినీటి పన్ను, గ్రంథాలయపు పన్నులు ముక్కు పిండి వసూలు చేశారు దాదాపు 85% పైగా పన్ను వసూలు చేశారనే ప్రకటన కూడా అధికారుల నుంచి వచ్చింది అయితే మూడు మాసాలుగా కార్మికులకు వేతనాలు అందించలేని పరిస్థితిలో ప్రస్తుత పంచాయతీ ప్రత్యేక అధికారి పాలన, మేజర్ పంచాయతీ కార్యదర్శి పనితీరు ఉండటం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొత్త భవనాలకు బిల్డింగ్ అప్రూవల్ లు, నీటి కొళాయి కొత్త కనెక్షన్లు, ఎన్ఓసీలు ఇచ్చే విషయంలో పరుగులు పెట్టే పంచాయతీ కార్యదర్శి..సిబ్బందికి సక్రమంగా వేతనాలు అందించకపోవడం పట్ల పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక్క నెల జీతం ఆగితేనే… ఆ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా ఉంటుంది.. ఏకంగా మూడు మాసాలకు పైగా జీతాలు అందకపోతే దాదాపు 18 కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుందో అవగాహన చేసుకోవచ్చు . పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు, కనీసం వంట గ్యాస్ పొందాలన్నా… ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు ప్రత్యేక అధికారి పాలనలోనే సిబ్బందికి జీతాలు అందలేదంటే… మిగిలిన విషయాలు.. అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతాయో అవగతం చేసుకోవచ్చు. ఈ కారణాలతోనే పారిశుద్ధ్య పనులు చేసేందుకు చాలామంది వెనకడుగు వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు పంచాయతీ పారిశుధ్య కార్మికులు, ఇతర సిబ్బంది ఏదైనా సమస్యల విషయంపై ప్రశ్నిస్తే.. కార్యదర్శి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారని, కార్యాలయంకు వివిధ పనులు పై వచ్చే వారితో నిర్లక్ష్యపు సమాధానలే వస్తున్నాయని మరికొందరు ఆరోపిస్తున్నారు

-ప్రత్యేక అధికారి జాడేది..??

సర్పంచుల పదవీకాలం ముగిసిపోవడంతో పంచాయతీలకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది సత్యవేడు మేజర్ పంచాయతీ పరిధికి స్థానిక ఎంపీడీవో చంద్రశేఖర్ నియమించారు ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి సంయుక్తంగా ఇంతవరకు ఏ ఒక్క పనులను పరిశీలించిన దాఖలాలు లేవని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులు, కార్యాలయ సిబ్బంది, మంచినీటి సరఫరా చేసేవారికి జీతాలు అందకపోవడంతో వారి గురించి పట్టించుకునే దిక్కు లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పరిస్థితి ఇలాగే కొనసాగితే.. అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా వెనుకడుగు తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!