ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పిచ్చాటూరు మండలంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

పిచ్చాటూరు మండలంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు, జూన్ 21 గరుడధాత్రి:
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పిచ్చాటూరు మండలంలోని వెంగళత్తూర్ జడ్పీ హైస్కూల్‌తో పాటుగా స్థానిక ప్రైవేట్ పాఠశాలల్లో ఆదివారం యోగా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పిచ్చాటూరు ఎంపీడీవో మహమ్మద్ రఫీ, ఎంఈఓ-2 యుగంధర్ రాజు పాల్గొని యోగా ప్రాముఖ్యతను వివరించారు. యోగా ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందుతాయని విద్యార్థులకు సూచించారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రభుత్వ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని వివిధ యోగా ఆసనాలను ప్రదర్శించారు. మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఆవరణల్లో అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు సిబ్బందిని అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!