ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పిజిఆర్ఎస్ సేవలపై పై క్యూ.ఆర్  కోడ్‌ ద్వారా స్పందన తెలియజేయండి- జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్...

పిజిఆర్ఎస్ సేవలపై పై క్యూ.ఆర్  కోడ్‌ ద్వారా స్పందన తెలియజేయండి- జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

📰 Generate e-Paper Clip

గడురదాత్రి న్యూస్ కడప, జూలై 26 : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) ద్వారా అందుతున్న సేవలపై ప్రజలు తమ స్పందన తెలియజేయాలని జిల్లా కలెక్టర్ డా శ్రీధర్ చెరుకూరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా మరింత పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన సేవలను అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిరంతర అభిప్రాయ సేకరణ చేసి ప్రజల సంతృప్తి స్థాయిని మెరుగుపరచడం, వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను కోరుతుందన్నారు. పిజిఆర్ఎస్ కేంద్రాలను సందర్శించే పౌరుల నుండి అభిప్రాయాన్ని సేకరించేందుకు జిల్లా, మండల స్థాయి పిజిఆర్ఎస్ కేంద్రాలలో, వివిధ మాధ్యమాల్లో ప్రజల అభిప్రాయ సేకరణకు క్యూ ఆర్  కోడ్‌ను ప్రదర్శించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. జిల్లా, మండల స్థాయి పిజిఆర్ఎస్ కేంద్రాల ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాలలో ప్రజలకు స్పష్టంగా కనిపించేలా క్యూ.ఆర్ కోడ్ ప్రముఖంగా ప్రదర్శించాలని ఆదేశించారు. క్యూ. ఆర్  కోడ్‌ను స్పష్టంగా, కంటికి కనిపించే పరిమాణంలో ముద్రించి, ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. పౌరులు పిజిఆర్ఎస్  సేవలను పొందిన వెంటనే తమ మొబైల్ ఫోన్‌ల ద్వారా క్యూ.ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చన్నారు. . ఎక్కువ సంఖ్యలో పౌరులు భాగస్వామ్యం అయ్యే విధంగా నోటీసు బోర్డులు, హెల్ప్ డెస్క్‌లు, ఫిర్యాదుల కౌంటర్లు, తదితర ప్రదేశాల్లో పెట్టాలని కలెక్టర్ సూచించారు.

క్యూ.ఆర్ కోడ్ ప్రజల స్పందన అధికారిక పి.జి.ఆర్.ఎస్ పోర్టల్‌ https://pgrs.ap.gov.in/Home/QRGrievance Feedback కు చేరుతుందని అన్నారు.

ఆర్జీల స్థితిగతులు తెలుసుకొనుటకు టోల్ ఫ్రీ నంబర్ 1100 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. పి.జి.ఆర్.ఎస్ ను వినియోగించుకోవాలని, తమ అభిప్రాయాలను తెలియజేస్తూ మరింత మెరుగైన సేవలు అందించుటకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

ప్రతీ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోను, మండల కార్యాలయాల్లోనూ నిర్వహించే పి.జి.ఆర్.ఎస్ లో అర్జీలు అందించండి, వాటిపై మీ స్పందన క్యూ.ఆర్ కోడ్ ద్వారా తెలియజేయండి అని కలెక్టర్ డా శ్రీధర్ చెరుకూరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!