ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపెద్దిరెడ్డితో పిచ్చాటూరు వైఎస్సార్‌సీపీ నేతల భేటీ -​పార్టీ బలోపేతం, స్థానిక రాజకీయాలపై చర్చ

పెద్దిరెడ్డితో పిచ్చాటూరు వైఎస్సార్‌సీపీ నేతల భేటీ -​పార్టీ బలోపేతం, స్థానిక రాజకీయాలపై చర్చ

📰 Generate e-Paper Clip

పెద్దిరెడ్డితో పిచ్చాటూరు వైఎస్సార్‌సీపీ నేతల భేటీ
-​పార్టీ బలోపేతం, స్థానిక రాజకీయాలపై చర్చ

పిచ్చాటూరు మే24 గరుడధాత్రి :
వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పిచ్చాటూరు మండల పార్టీ కన్వీనర్ కె.వి. చలపతిరాజుమర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీపరంగా చేపడుతున్న కార్యక్రమాలపై వారు ప్రధానంగా చర్చించారు. రాబోయే రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేసే దిశగా, కార్యకర్తలకు అండగా నిలిచే అంశాలపై పెద్దిరెడ్డి వారికి పలు సూచనలు చేసినట్లు సమాచారం. ఈ భేటీలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు రమేష్ రాజు, సీనియర్ నాయకులు సూరిబాబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!