ePaper
Monday, August 24, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను యజమానికి అప్పగించిన కుప్పం ఆర్టీసీ సిబ్బంది

పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను యజమానికి అప్పగించిన కుప్పం ఆర్టీసీ సిబ్బంది

📰 Generate e-Paper Clip

కుప్పం,ఆగస్టు 23 (గరుడ ధాత్రి న్యూస్)

ప్రయాణికుల భద్రతతో పాటు వారి వస్తువుల సంరక్షణలోనూ ఆర్టీసీ సిబ్బంది చూపుతున్న బాధ్యత, నిజాయితీకి మరో నిదర్శనం చోటుచేసుకుంది.బస్సులో ప్రయాణ సమయంలో ఓ ప్రయాణికుడు పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను ఆర్టీసీ సిబ్బంది గుర్తించి భద్రపరిచారు. అనంతరం డిపో మేనేజర్ ఆర్.రవి చొరవతో సెల్‌ఫోన్‌కు సంబంధించిన వివరాలను పరిశీలించి, అసలు యజమానిని గుర్తించారు. తదనంతరం సదరు సెల్‌ఫోన్‌ను యజమానికి సురక్షితంగా అప్పగించడం జరిగింది.
ఈ సందర్భంగా సెల్‌ఫోన్ యజమాని ఆర్టీసీ సిబ్బంది చూపిన నిజాయితీ, బాధ్యతాయుతమైన సేవాభావాన్ని అభినందిస్తూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు, ఎస్ టి ఐ రాజకుమారి మరియు సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ నిజాయితీ, సేవాభావంతో పనిచేయడమే ఆర్టీసీ సిబ్బంది ప్రధాన లక్ష్యం అని ఈ సందర్భంగా డిపో మేనేజర్ రవి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!