ePaper
Friday, September 25, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిప్రజలతో ఉండండి, చేసిన అభివృద్ధిని చెప్పండి - ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

ప్రజలతో ఉండండి, చేసిన అభివృద్ధిని చెప్పండి – ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

📰 Generate e-Paper Clip

పనిచేసే వారికి గుర్తింపు, అవకాశాలు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో వందశాతం విజయం సాధించాలి

—ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

చిత్తూరు సెప్టెంబర్ 23 (గరుడ రాత్రి న్యూస్)పార్టీ అధికారంలో ఉంటేనే మనకుగుర్తింపుఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల నిర్ణయానికి కట్టుబడి పని చేయాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ స్పష్టం చేశారు. చిత్తూరు నగరపాలక సంస్థ స్థానిక ఎన్నికల సన్నద్ధతా సమావేశం బుధవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అధ్యక్షతన జరిగింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి, ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి, చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, పరిశీలకులు కుమారి ఇతర సీనియర్ నాయకుల పాల్గొన్న ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతోపనిచేయాలన్నారు. తక్కువ సమయం ఉండడంతో నాయకులు, సంబంధిత వార్డుల ఇన్చార్జిలు, కమిటీల సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించిప్రజాసమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలతో ఉంటూ, మనం చేసిన అభివృద్ధిని చూపించాలని,క్షేత్రస్థాయిలో కష్టపడే వారికి, పార్టీ పట్ల అంకితభావం ఉన్న వారికే గుర్తింపు, అవకాశాలు వస్తాయన్నారు. కూటమి పార్టీలోనిజనసేన,భాజపాలకుఅవకాశాలుకల్పించాల్సిన నేపథ్యంలో.. కొన్నిచోట్ల అనుకున్న వారికి అవకాశాలు దక్కకపోవచ్చు అని.. అంతమాత్రాన నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదన్నారు. అవకాశం దక్కని నిజమైన నాయకులు, కార్యకర్తలకు ప్రత్యామ్నాయంగా పదవులు, అవకాశాలు కల్పిస్తామన్నారు. ఎన్నికలకు సంబంధించి అన్ని అంశాలను బేరీజు వేసుకొని పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. ఇదే సమయంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో వైకాపా నాయకులు అసత్యాలు ఆడుతూ, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారని, వీటిని ఎక్కడికక్కడ అడ్డుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వద్దకు తీసుకెళ్లడంతో పాటుగా.. వైకాపా నాయకుల దౌర్జన్యాలు,దురాగతాలను, వారి అక్రమ వ్యాపారాల గురించి ప్రజలను అప్రమత్తంచేయాలనిపిలుపునిచ్చారు. ఎదుటివారిని విమర్శించే ముందు.. మనం ఎంత సంసారులమో ఒకసారి సరి చూసుకోవాలని వైకాపా నాయకులకు చురకలు అంటించారు. వైకాపా నాయకుల అక్రమాలు, అక్రమ ఇసుక రవాణా, ఎర్రచందనం స్మగ్లింగ్, గులకరాళ్ళ అక్రమ రవాణా, మైనింగ్ లో చేసిన అక్రమాలను త్వరలోనే ప్రజల ముందుకు తెస్తామన్నారు.సమావేశంలో చిత్తూరు నగర తెదేపా అధ్యక్షుడిగా వరుణ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తనను నమ్మి పార్టీ పదవిని అప్పగించిన అధిష్టానానికి, ఎమ్మెల్యే గారికి, నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు కూటమి పార్టీలను కలుపుకొనిముందుకెళ్తానన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష గెలుపు కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు.
సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు ప్రసంగించారు. సమావేశంలో నగర అధ్యక్షులు వరుణ్ కుమార్, నాయకులు కాజురు బాలాజీ, మోహన్ రాజ్, సీకే లావణ్య, రాజేష్ కుమార్ రెడ్డి, ఆముద, వెంకటేష్ యాదవ్, గురజాల సురేష్, ఈశ్వరరావు, నీరజాక్షుల నాయుడు, గోపాలకృష్ణ, అత్తుబాయ్, నళిని, లోకేష్ రెడ్డి, లీలావతి, అశోక్, క్లస్టర్, డివిజన్, బూత్ ఇంచార్జిలు, తెదేపా ప్రధాన, అనుబంధ కమిటీల సభ్యులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!