ePaper
Friday, September 18, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ప్రజాసేవలో పీఎం, సీఎంలు ఇద్దరికీ ఇద్దరే సాటి

ప్రజాసేవలో పీఎం, సీఎంలు ఇద్దరికీ ఇద్దరే సాటి

📰 Generate e-Paper Clip

ఘనంగా చిత్తూరులో ఆశీర్వాద దీపం కార్యక్రమం

– ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్.

చిత్తూరు సెప్టెంబర్ 17 (గరుడ దాత్రి న్యూస్)ప్రజా సేవలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , ఏపీ ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడు ఇద్దరికీ ఇద్దరే సాటి అని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. భారత ప్రధానమంత్రి పుట్టిన రోజు సందర్భంగా గురువారం బీవీ రెడ్డి కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో సేవా సంకల్ప్, స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమాల్లో భాగంగా “ఆశీర్వాద దీపం” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రంగవల్లులు వేసి, దీపాలు వెలిగించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మోడీ భారతదేశాన్ని,ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు చెప్పారు. ఏడుపదుల వయసులోనూ ఇరువురు నేతలు ఎంతో ఉత్సాహంగా ప్రజాసేవ చేస్తున్నారని, ఇరువురు వారి జీవితంలో యోగాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. రానున్న నెల రోజులపాటు స్వచ్ఛతహి సేవ కార్యక్రమాలను విస్తృతంగాచేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, కమిషనర్ పి నరసింహ ప్రసాద్, సహాయ కమిషనర్ ఎ ప్రసాద్, ఎంహెచ్వో డా. అనిల్ కుమార్, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!