ePaper
Friday, September 18, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా పూతలపట్టులో ఉచిత వైద్య శిభిరం

ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా పూతలపట్టులో ఉచిత వైద్య శిభిరం

📰 Generate e-Paper Clip

పూతలపట్టు, సెప్టెంబర్ 17 గరుడ ధాత్రి న్యూస్ :

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని పూతలపట్టు మండల కేంద్రంలో గురువారం పేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పూతలపట్టు మండల బీజేపీ అధ్యక్షుడు ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
శిబిరానికి హాజరైన పేదలు, ప్రజలకు వైద్యులు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య పరిస్థితిపై సూచనలు అందించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా వైద్య సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు, చిత్తూరు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సుజిత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోమశేఖర్ చౌదరి, మండల ఓబీసీ అధ్యక్షులు లింగేశ్వర, ఉపాధ్యక్షులు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!