ePaper
Tuesday, September 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిప్రజా భద్రతకు తక్షణ చర్యలు చేపట్టాలి – పలమనేరు పరిరక్షణ సమితి

ప్రజా భద్రతకు తక్షణ చర్యలు చేపట్టాలి – పలమనేరు పరిరక్షణ సమితి

📰 Generate e-Paper Clip

పలమనేరు, సెప్టెంబర్ 28 ( గరుడ ధాత్రి ) : పలమనేరు పట్టణం, పరిసర ప్రాంతాల్లో ప్రజల భద్రతకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ పలమనేరు పరిరక్షణ సమితి ప్రతినిధులు ఆదివారం మున్సిపల్ కమిషనర్‌, ఆర్‌అండ్‌బీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు వినతిపత్రాలు అందజేశారు.
పట్టణంలోని ప్రధాన రహదారులు, కూడళ్లు, సర్కిళ్లు, స్పీడ్ బ్రేకర్లు, వంతెనల వద్ద తెల్లరంగు, రోడ్డు భద్రతా సూచికలు సరిగా కనిపించకపోవడంతో వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, రంగబాబు సర్కిల్, జీలాని సర్కిల్, లయన్స్ క్లబ్, ఎంవీఆర్ కళాశాల, సాయిగార్డెన్ సిటీ, గంగవరం జాతీయ రహదారి తదితర ప్రాంతాల్లో అవసరమైన తెల్లరంగు, రోడ్డు భద్రతా మార్కింగ్ పనులను చేపట్టాలని కోరారు. అలాగే గుడియాత్తం రోడ్డు మలుపు వద్ద దెబ్బతిన్న కాంపౌండ్ వాల్‌కు మరమ్మతులు చేయించాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రమాదాలు జరగకముందే అవసరమైన పనులను ప్రాధాన్యతతో పూర్తి చేయాలని సమితి ప్రతినిధులు కోరారు. వినతిపత్రాలు స్వీకరించిన అధికారులు సమస్యలను పరిశీలించి అనుకూల చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలమనేరు పరిరక్షణ సమితి అధ్యక్షుడు నరసింహులు, ప్రధాన కార్యదర్శి వి. నారాయణ కోశాధికారి రామచంద్ర, వైస్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రెడ్డి, సలహాదారులు శ్రీపురం సీతారామయ్య, జాయింట్ సెక్రెటరీ రెడ్డప్ప నాయుడు, ఆర్గనైజింగ్ సెక్రెటరీలు విజయకుమార్, దొరస్వామి నాయుడు ,సాంబయ్య కమిటీ సభ్యులు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!