కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కోరిన తిరుపతి ఎంపీ డా.మద్దిల గురుమూర్తి
తిరుపతి ఆగస్టు
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ దంత వైద్య కళాశాలలు, ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేం దుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఫ్లోర్ లీడర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో కలిసి సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసి కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ వైద్య సంస్థల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏళ్ల తరబడి రెగ్యులర్ ఉద్యోగులతో సమానమైన విధులు, బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ తక్కువ వేతనాలతోపనిచేస్తున్నారని తిరుపతి ఎంపీ గురుమూర్తి తెలిపారు. సమాన పనికి సమాన వేతనం అనే సూత్రాన్ని అమలు చేసి, అర్హత కలిగిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు తగిన వేతనాలతో పాటు అవసరమైన సేవా ప్రయోజనాలు కల్పించాలని కేంద్ర మంత్రిన
