ePaper
Thursday, October 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిబి-ఫారాలు ఇవ్వడానికి,,అభ్యర్థుల ఉపసంహరణలకు 27న మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు

బి-ఫారాలు ఇవ్వడానికి,,అభ్యర్థుల ఉపసంహరణలకు 27న మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు

📰 Generate e-Paper Clip

ఎంపీటీసీకి రూ.4 లక్షలు, జడ్పీటీసీకి రూ.8 లక్షల వ్యయ పరిమితి

బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్25

బైరెడ్డిపల్లి మండల ఎంపీటీసీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు, అధీకృత వ్యక్తి అసలు సంతకంతో జారీ చేసిన బి-ఫారాలను ఈ నెల 27వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలలోపు మండల పరిషత్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని రిటర్నింగ్ అధికారి ఎన్. వెంకటరాముడు, సహాయ రిటర్నింగ్ అధికారి మరియు ఎంపీడీఓ కె. ఆనందబాబు, తహసీల్దార్ ప్రసన్న కుమార్ సంయుక్త ప్రకటనలో తెలిపారు.

అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలనుకునేవారు అదే గడువులోగా Form-VIIలో, అభ్యర్థి స్వయంగా రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. సక్రమంగా ఉపసంహరించుకున్న అభ్యర్థిత్వాన్ని తిరిగి పునరుద్ధరించలేరని స్పష్టం చేశారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన ప్రకారం ఎంపీటీసీ అభ్యర్థికి గరిష్ఠ ఎన్నికల వ్యయం రూ.4 లక్షలు, జడ్పీటీసీ అభ్యర్థికి రూ.8 లక్షలు మాత్రమే. అభ్యర్థులు రోజువారీ ఖర్చుల లెక్కలను ఆధారాలతో సక్రమంగా నిర్వహించాలి. వ్యయ పరిమితిని మించడం ఎన్నికల అవినీతి చర్యగా పరిగణించబడుతుందని, చట్టప్రకారం అనర్హత సహా చర్యలకు దారితీయవచ్చని హెచ్చరించారు. నిర్ణీత విధంగా, గడువులోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు సమర్పించకపోతే కూడా అనర్హత చర్యలకు గురయ్యే అవకాశం ఉందన్నారు.

ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం, బహుమతులు లేదా ఇతర ప్రయోజనాలు ఇవ్వడం, ఇస్తామని హామీ ఇవ్వడం, బెదిరించడం, కులమతాల పేరుతో ఓట్లు కోరడం నిషేధం. సభలు, ర్యాలీలు, లౌడ్‌స్పీకర్లు, ప్రచార వాహనాలకు అవసరమైన అనుమతులు తీసుకోవాలి. ప్రభుత్వ ఆస్తులను ప్రచారానికి వినియోగించరాదు. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటిస్తూ ప్రశాంత ఎన్నికలకు సహకరించాలని వారు కోరారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!