👉 అక్రమంగా నిలువ ఉంచిన 1500 బస్తాలు సీజ్
👉 అక్రమంగా నిలువ ఉంచిన ఎరువుల బస్తాలను చూసి నివ్వరపోయిన వ్యవసాయ శాఖ అధికారులు
గరుడ దాత్రి న్యూస్ జులై 27:-బ్రహ్మంగారిమఠం
బ్రహ్మంగారి మఠం నందు గల బద్వేల్ రోడ్డులో గల కక్కయ్య స్వామి మఠం సమీపంలో లేపాక్షి ట్రేడర్స్ టైల్స్ అండ్ శానిటరీ అనే పేరుగల గోడౌన్ నందు అక్రమంగా నిలువ ఉంచిన ఎరువుల బస్తాలు నిలువ చేసారు. సమీపంలో స్థానికులని విచారించిగా ఈ గోడౌన్ వెంకటేశ్వర ఫెర్టిలైజర్ యజమాని పి వెంకట కృష్ణారెడ్డిది అని తెలిపారు. సదరు శ్రీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ తెలుగు గంగ రోడ్డులోని ఒక కాంప్లెక్స్ లో వ్యాపారం నిర్వహిస్తున్నారు వారిని పిలిచి విచారించగా ఈ గౌరవం నా ఆధీనంలో ఉంది మరియు గోడౌన్ లో ఉన్న ఎరువులు మొత్తము శ్రీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ ఎరువులు దుకాణం ద్వారా కొనుగోలు చేసి నిలువ ఉంచారని తెలియజేశారు సదరు గోడౌన్ మండల వ్యవసాయ అధికారి అయిన కే ప్రవీణ్ మరియు పంచాయతీ దారుల సమక్షంలో పంచనామా చేసి అనుమతి లేకుండా అక్రమంగా నిలువ ఉంచిన ఎరువుల గోడౌన్ ని ఎఫ్. సి ఒ యాక్ట్ 1985 ప్రకారం 6 ఎసెక్షన్ ప్రకారం చట్ట విరుద్దమని సీజ్ చేసారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ జెడిఎ వెంకటేశ్వరరావు ఫెర్టిలైజర్స్ ఏవో సుమంత్ రెడ్డి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రవీణ్ పాల్గొన్నారు
