ePaper
Tuesday, September 22, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్బూరుగపల్లి లోని మంచినీటి సమస్యను పరిష్కరించాలి : చరణ్ రాయల్

బూరుగపల్లి లోని మంచినీటి సమస్యను పరిష్కరించాలి : చరణ్ రాయల్

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి సెప్టెంబర్ 20 గరుడ దాత్రి న్యూస్

మండలంలోని అమినిగుంట పంచాయతీ బూరగపల్లిలో నెలకొని ఉన్న మంచినీటి సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని జనసేన పార్టీ మండల నాయకుడు గందోడి చరణ్ రాయల్ అధికారులను కోరారు ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు గ్రామంలో సందర్శించారు ముఖ్యంగా తాగునీటి సమస్య ఉందని గ్రామస్తుల నుంచి అడిగి తెలుసుకున్నారు గత ఒకటిన్నర నెలగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లిన ఆయా ప్రాంతాలలో నీరు లేక రైతులు రావద్దు అంటున్నారని గ్రామస్తులు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు గ్రామానికి నీటిని సరఫరా చేసే బోరులో భూగర్భ జలాలు అడిగింటి పోవడంతో సమస్య వచ్చిందని ప్రభుత్వం నుంచి మంచినీటి సమస్య పరిష్కారం కోసం నిధులు మంజూరు చేసినప్పటికీ అధికారులు నిమ్మకు నీరత్తినట్లు వ్యవహరించడం బాధాకరమన్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పట్టణ గ్రామీణ ప్రాంతాలలోని మంచినీటి సమస్యకు కావాల్సినంత నిధులు కేటాయించడం జరిగిందన్నారు అయితే అధికారులు నిధులు లేవని చేతులెత్తేస్తున్నారని ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా ఆయన అన్నారు పలు గ్రామాలలో నెలకొని ఉన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులను కోరారు ఊరకపల్లిలో ప్రత్యామ్నాయంగా మరొక బోరును వేసేంతవరకు ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయాలని మండల అధికారులను గందోడి చరణ్ రాయల్ కోరారు తాగునీటి సమస్య పరిష్కరిస్తామని గ్రామస్తులకు ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మురళి నగేష్ రామ్ కి రాఖీ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!