ePaper
Monday, September 21, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్భవిష్యత్తు ఎలక్ట్రానిక్ వాహనాలదే

భవిష్యత్తు ఎలక్ట్రానిక్ వాహనాలదే

📰 Generate e-Paper Clip

ఘనంగా టు వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ మూడవ వార్షికోత్సవం

–చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు

—ఎమ్మెల్యే గురుజాల జగన్ మోహన్*

చిత్తూరు,సెప్టెంబర్ 20(గరుడదాత్రిన్యూస్)భవిష్యత్తు అంతా ఎలక్ట్రానిక్ వాహనాలదేనని,మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా టూ వీలర్ మెకానికులు తమ నైపుణ్యాలనుపెంపొందించుకోవాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు (ఎంపీ) దగ్గుమళ్ళ ప్రసాదరావు సూచించారు.
ఆదివారం చిత్తూరు నగరంలో నిర్వహించిన “టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్” మూడవ వార్షికోత్సవ వేడుకలకు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ ముఖ్య అతిథులుగాపాల్గొన్నారు.ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావుమాట్లాడుతూ.. వాహన రంగంలో వస్తున్న పెను మార్పులను మెకానికులుగమనించాలన్నారు. రాబోయే రోజుల్లో ఈవీ (EV) వాహనాల హవా నడవనుందని, అందుకు తగ్గట్టుగా కొత్త టెక్నాలజీని నేర్చుకుని అప్‌డేట్ అవ్వడం ద్వారానే మార్కెట్‌లో రాణించగలరని సూచించారు. ట్రైల్ రన్ విషయంలో ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి,రోడ్డుప్రమాదాలను బారిన పడకుండా తమ విలువైన ప్రాణాలను రక్షించుకోవాలనిహెచ్చరించారు.టూ వీలర్స్ మెకానిక్ ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.ఎమ్మెల్యే గురుజాల జగన్ మోహన్ మాట్లాడుతూ.సమాజంలో రాత్రింబవళ్లు కష్టపడే అసంఘటిత కార్మికులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మెకానికుల సంక్షేమానికి, వారి కుటుంబాల అభివృద్ధికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీఇచ్చారు.అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని అందరూ ఐక్యంగా ముందుకు సాగడం అభినందనీయమన్నారు.
చిత్తూరు టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు, పక్కా ఇండ్ల మంజూరు విషయంలో చిత్తశుద్ధితోవ్యవహరిస్తామన్నారు. సికేలావణ్యలావణ్య మాట్లాడుతూ.. కష్టపడి పనిచేసేకార్మికకుటుంబాలలోని మహిళలకు, వారి పిల్లల చదువులకు తమ వంతు మద్దతు ఉంటుందని తెలిపారు. మెకానిక్ అసోసియేషన్ సభ్యులు ఎదుర్కొంటున్నసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో స్థానిక మెకానికులు, కార్మికులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!