బైరెడ్డిపల్లి, అక్టోబర్ 21 గరుడదాత్రి :
తిరుపతి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బైరెడ్డిపల్లి మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం శెట్టి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.
చిత్తూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆయన జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను సమర్పించారు. ప్రస్తుతం ఆయన బైరెడ్డిపల్లి మండల టీడీపీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న సుబ్రహ్మణ్యం శెట్టి జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో స్థానిక రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
