ePaper
Saturday, October 31, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సదుం లో వైసీపీ -టీడీపీ పరస్పర దాడులు ..వాహనం కాల్చివేత

సదుం లో వైసీపీ -టీడీపీ పరస్పర దాడులు ..వాహనం కాల్చివేత

📰 Generate e-Paper Clip

సదుం గరుడ ధాత్రి అక్టోబర్ 21
మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీటీసీ స్థానాలకు అధికారులు నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాటు చేశారు. సదుం పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అయితే ఎలాగైనా వైసీపీ వాళ్ల ను అడ్డుకోవాలని టీడీపీ వాళ్ళు ఉదయం నుంచి మండల పరిషత్ వద్ద ఎదురు చూస్తూ ఉన్నారూ. మధ్యాహ్నం రెండు గంటలకు జడ్పీ మాజీ వైస్ చైర్మన్ పెద్దిరెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి మాజీ సభ్యుడు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి ల ఆధ్వర్యంలో ఎంపిటిసి అభ్యర్థులు అందరూ ఒకేసారి తమ ప్రతిపాదికులతో కలిసి వచ్చారు. అదేసమయంలో టీడీపీ కార్యకర్తలు నడిగడ్డ పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒకరి పై ఒకరు రాళ్ళ దాడులు చేసుకున్నారు. పెట్రోల్ సీసాల ను విసిరి వేసారు.ఇంత జరిగినా వైసీపీ నాయకులు మండల పరిషత్ కార్యాలయంలో కి వచ్చేశారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ రెడ్డి కి గాయాలు కావడంతో పీలేరు కు తరలించారు. ఆయన కారుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం తో అది కాలి బూడిద అయింది.పీలేరు అగ్ని మాపక యంత్రం వచ్చి మంటలు ఆర్పి వేసారు. చౌడేపల్లి సి ఐ వెంకటేశ్వర్లు,సదుం ఎస్ ఐ విష్ణు నారాయణ ఆధ్వర్యంలో అందరిని చెదర కొట్టారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!