ePaper
Saturday, October 3, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిబైరెడ్డిపల్లి లో ట్రాఫిక్ కష్టాలు... పట్టించుకొండి అధికారులు ప్లీజ్

బైరెడ్డిపల్లి లో ట్రాఫిక్ కష్టాలు… పట్టించుకొండి అధికారులు ప్లీజ్

📰 Generate e-Paper Clip

*వాహన చోదకులు ట్రాఫిక్ క్రమబద్ధించుకొన్నారు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్3

బైరెడ్డిపల్లి చెక్ పోస్ట్ నాలుగు కూడళ్లు వద్ద శనివారం ట్రాఫిక్ రద్దీ నెలకొని వాహనాలు రహదారిపై బారులు తీరాయి. దీనితో సుమారు అర్ధ గంట వాహన పోకలు స్తంభించింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక భారీ వాహనం కుప్పం వైపు వెళ్ళడానికి క్రాస్ అవుతుండగా కుప్పం వైపు నుంచి మరో భారీ వాహనం పలమనేరు వైపు పోవడానికి రావడంతో ఇబ్భంధులు ఏర్పడి ట్రాఫిక్ సమస్య నెలకొన్నది. చివరకు వాహన చోదకులు ట్రాఫిక్ క్రమబద్ధించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.శనివారం పశువుల సంత కావడం,మరోవైపు బెంగళూరు,చెన్నై ఎక్స్ప్రెస్ హైవే బైరెడ్డిపల్లి సెక్షన్ ప్రారంభం అయిన తరువాత ఈ రహదారి బెంగళూర్ ట్రాఫిక్ తో పోటీ పడుతూ ప్రతి రోజు రోడ్డు ప్రమాదం లు కొనసాగుతోంది.
మరోవైపు భారివాహనాలు వచ్చినప్పుడు వాహన రాకపోకలు కు తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడం జరుగుతున్న సంబందిత అధికారులు ట్రాఫిక్ నివారణ చర్యలు తీసుకోక పోవడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నాలుగు రోడ్ల కూడళ్లు వద్ద ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు విధులు చేపడితే ఈ కష్టాలు తగ్గుతుంది. మరో వైపు రహదారి ఆక్రమణలు గుర్తించి తొలగించక పోవడం,బైపాస్ రహదారి నిర్మాణం లో జాప్యం ప్రజలకు శాపంగా మారింది. ఇకనైనా అధికారులు ప్రజల రక్షణ కోసం ఈ రెండు పనులు చెప్పటాల్సిన అవసరం ఉంది.
End.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!