ePaper
Saturday, October 3, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన శ్రీ కల్కి భగవాన్ మహాసమాధి కార్యక్రమం

ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన శ్రీ కల్కి భగవాన్ మహాసమాధి కార్యక్రమం

📰 Generate e-Paper Clip

మహాసమాధిని పుణ్యక్షేత్రంగా ప్రతిష్ఠించిన ఆధ్యాత్మిక సంస్థ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అధికారిక తుపాకీ వందనం.. పాల్గొన్న ప్రముఖులు, ప్రజాప్రతినిధులు

ఆంధ్రప్రదేశ్, అక్టోబర్ 3, 2026:

శ్రీ కల్కి భగవాన్ మహాసమాధి కార్యక్రమం అక్టోబర్ 2వ తేదీ సూర్యాస్తమయ సమయానికి భక్తిశ్రద్ధల నడుమ ముగిసింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించిన భక్తులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. చివరి నివాళిగా మహాసమాధిపై చందనపు పొడితో కలిపిన ఇసుకను, పద్మ పుష్పాలను సమర్పించారు.

శ్రీ కల్కి భగవాన్, శ్రీ అమ్మ దంపతుల ఏకైక కుమారుడు, ముక్తి గురువు శ్రీ కృష్ణాజీ ఈ అంతిమ క్రతువులకు నాయకత్వం వహించారు. శ్రీ కృష్ణాజీ, శ్రీ ప్రీతాజీ తమ కుమార్తె లోకా కృష్ణ సహకారంతో ఈ కార్యక్రమాలను నిర్వహించారు.

ప్రాచీన హిందూ సంప్రదాయంలో మహర్షులకు గౌరవం అర్పించే ఆచారానికి అనుగుణంగా, మహాసమాధిని పుణ్యయాత్రా స్థలంగా ప్రతిష్ఠించారు. రానున్న సంవత్సరాల్లో భక్తులకు ఆశీస్సులు అందించే పవిత్ర క్షేత్రంగా ఇది నిలవనుందని ఆధ్యాత్మిక సంస్థ తెలిపింది.

శ్రీ కల్కి భగవాన్ ఆశీస్సులు, అనుగ్రహం కోరుకునే లక్షలాది మంది భక్తుల కోసం ఈ ప్రదేశంలో భారీ సమాధి మందిరాన్ని నిర్మించనున్నట్లు శ్రీ కృష్ణాజీ ప్రకటించారు.

ప్రభుత్వ లాంఛనాలతో ప్రత్యేక గౌరవం :

శ్రీ కల్కి భగవాన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి అధికారిక గౌరవాలను అందించింది. ఇందులో అధికారిక తుపాకీ వందనం కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు.

వారిలో:

– శ్రీ ఆనం రామనారాయణరెడ్డి — ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖ మంత్రి.
– న్యాయమూర్తి వై. లక్ష్మణ్ రావు — ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి.
– శ్రీ వెంకటేశ్వర్లు, ఐఏఎస్ — తిరుపతి జిల్లా కలెక్టర్.
– శ్రీ టి. సుబ్బారాయుడు, ఐపీఎస్ — తిరుపతి జిల్లా పోలీసు అధికారి.
– సత్యవేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం
– డాక్టర్ నెలవల విజయశ్రీ — సూళ్లూరుపేట శాసనసభ సభ్యురాలు.
– గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్,
– వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ,
– శ్రీ బి. కల్యాణ్ చక్రవర్తి — గూడూరు శాసనమండలి సభ్యుడు.

ప్రభుత్వం అందించిన ఈ గౌరవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులను భావోద్వేగానికి గురిచేసిందని ప్రకటన పేర్కొంది. మహాసమాధి కార్యక్రమం మొత్తాన్ని ఆధ్యాత్మిక ఉద్యమానికి చెందిన అధికారిక అంతర్జాల వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు.

పోలీసుల సేవలకు ప్రశంసలు :

ఈ కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర పోలీసు శాఖ, ప్రత్యేక కార్యాచరణ దళం సమర్థవంతంగా విధులు నిర్వహించాయని సంస్థ ప్రశంసించింది. వరుసగా మూడు పగళ్లు, మూడు రాత్రుల పాటు వేలాది మంది భక్తులకు మార్గనిర్దేశం చేస్తూ, ఓర్పుతో సహకరించారని తెలిపింది.

ప్రతి భక్తుడు గౌరవప్రదంగా మహాసమాధి కార్యక్రమంలో పాల్గొనేలా పోలీసులు సహకరించారని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు :

శ్రీ కల్కి భగవాన్‌కు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో గౌరవం కల్పించినందుకు ఏకం ఆధ్యాత్మిక ఉద్యమం, ఏకం సంస్థానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాయి.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు, పోలీసు శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాయి. కార్యక్రమం అంతటా వారు అందించిన సహకారాన్ని సంస్థలు ప్రశంసించాయి.
అలాగే, తమ అధికారిక ఎక్స్‌ సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా నివాళి సందేశాలు, ప్రశంసలు తెలియజేసిన తమిళనాడు గవర్నర్‌కు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపాయి.

ఈ పవిత్ర కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు చేరవేసిన పత్రికా, ప్రసార మాధ్యమాల ప్రతినిధులకు కూడా సంస్థలు ధన్యవాదాలు తెలియజేశాయి.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!