ePaper
Saturday, August 8, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మంత్రి నారా లోకేష్ ను విమర్శిస్తే వైసిపి నాయకులకు పుట్టగతులు ఉండవు

మంత్రి నారా లోకేష్ ను విమర్శిస్తే వైసిపి నాయకులకు పుట్టగతులు ఉండవు

📰 Generate e-Paper Clip

కుప్పం రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజగోపాల్.
కుప్పం,ఆగస్టు 07(గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను విమర్శిస్తే వైసిపి నాయకులకు పుట్టుగతులు ఉండవని కుప్పం రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజగోపాల్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై ఏది పడితే అది మాట్లాడటం వైసీపీ నాయకులకు సరికాదన్నారు.
గత ప్రభుత్వం యువతను మోసం చేసిందన్నారు.
యువతకు మేలు చేసింది ఒక్క ఎన్డీఏ కుటమి ప్రభుత్వం ఒక్కటేఅన్నారు.వైసీపీ నాయకులకు రాష్ట్ర ప్రజలు పరీక్షల్లో జీరో మార్కులు వేసిన ఇంకా వారి తీరు మారలేదని విమర్శించారు .యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసి జాబ్ క్యాలెండర్ల ద్వారాప్రతి ఏటా ఉద్యోగాలు రిలీజ్ చేస్తానని చెప్పిన గత ప్రభుత్వం కేవలం న్యూ ఇయర్ క్యాలెండర్ లు రిలీజ్ చేసినారు తప్ప ఉద్యోగాలు భర్తీ చేసిన దాఖలాలు లేవు అని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటే అసూయ అక్కసుతో ధర్నా అనే నాటకాలతో ప్రజల దృష్టిని మరించాలని అనుకోవడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. వైసిపి వారు చేసిన మోసం ప్రతి ఒక్క నిరుద్యోగ యువత తెలుసుకొని వైసిపి ప్రభుత్వానికి చరమ గీతం పాడారన్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పించకపోతే కూటమి ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులకు జీవితాల్లో వెలుగులు నింపడం జరిగిందని తెలిపారు. ఐదేళ్లు డీఎస్సీ ఇవ్వకుండా యువతను మోసం చేసిన గత ప్రభుత్వం ఇప్పుడు పారదర్శకంగా జరిగిన మెగా డీఎస్సీపై ఫేక్ ప్రచారం నిర్వహించి వీధి నాటకాలు వేస్తున్నారని చెప్పారు. ఉద్యోగాలు భర్తీ చేయని గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వాన్ని ప్రశ్నించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ యువత భవిష్యత్తుపై శ్రద్ధ చూపించలేదని కేవలం ఆయనకు ఒక రాజకీయ లబ్ధి పొందడమే తెలుసునని దుయ్యబట్టారు. ఇలాంటి వీధి నాటకాలు ఆడుతున్న పార్టీకి శాశ్వతంగా ప్రజలు బహిష్కరించాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరిట బల ప్రదర్శన చేస్తున్నారని ప్రజలకు భయభ్రాంతులకు గురి చేసేలా బల ప్రదర్శన చేస్తున్నారని పరామర్శల పేరిట జగన్ చేసిన బల ప్రదర్శన వల్ల ఇప్పటికే ముగ్గురు చనిపోయారని దీనివల్ల ప్రజలకు ఏం సందేశం ఇస్తారని సూటిగా ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గంలో శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తూ మీటింగ్ అంటే మందు తాగిపిచ్చి అక్కడికి పంపి అమాయక ప్రజలతో గొడవలు దిగే విధంగా చేయడం దీనివల్ల ప్రజల్లో అభాసుపాలు కాక తప్పదని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!