ePaper
Friday, October 2, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిమదనపల్లెలో విజయవంతంగా 'గ్లోబల్ హార్టికల్చర్ హబ్'కు శంకుస్థాపన

మదనపల్లెలో విజయవంతంగా ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’కు శంకుస్థాపన

📰 Generate e-Paper Clip

* ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కు శంకుస్థాపన.
* రాయలసీమ ప్రాంతం నుంచి భారీ ఎత్తున తరలివచ్చిన రైతాంగం.
* ఆకట్టుకున్న అనంత్ అంబానీ ప్రసంగం.
* రాయలసీమ రతనాల సీమగా మారుతుందని రైతుల ఆశాభావం.
* కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు.
* మొక్కలు నాటిన నేతలు.
* ఆకట్టుకున్న స్టాల్స్, స్టాల్స్ ను పరిశీలించిన నిర్మల సీతారామన్, చంద్రబాబులు.
చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 02(ఆర్.శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం మదనపల్లెలో నిర్వహించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమం విజయవంతమైంది. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం విజయవంతానికి మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు విశేష కృషి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మదనపల్లె చేరుకున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ బిజెపి చీఫ్ మాధవన్, అయితే విద్యా శాఖల మంత్రి నారా లోకేష్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ లు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సభా వేదిక వద్ద ఏర్పాటుచేసిన హార్టికల్చర్ స్టాల్స్ ను సందర్శించారు. కేంద్ర మంత్రి రైతుల నుంచి వివిధ అంశాలపై వాకబు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాయలసీమ జిల్లాల నుంచి రైతులు భారీ ఎత్తున తరలివచ్చారు. రైతులే కాకుండా ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఈ కార్యక్రమాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ల ప్రసంగం ఆకట్టుకుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లె వేదికగా ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’, ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పి. వి. ఎన్. మాధవ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!