ePaper
Friday, October 2, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిప్రపంచ స్థాయి హార్టికల్చర్ కేంద్రంగా రాయలసీమ : ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి

ప్రపంచ స్థాయి హార్టికల్చర్ కేంద్రంగా రాయలసీమ : ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి

📰 Generate e-Paper Clip

పలమనేరు, అక్టోబర్ 02 ( గరుడ ధాత్రి ) : మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్ కేవలం ఒక శంకుస్థాపన మాత్రమే కాదని, రాయలసీమ రైతుల పంటలు ప్రపంచ మార్కెట్‌కు చేరే కొత్త ఆర్థిక వ్యవస్థకు ఇది శ్రీకారమని పలమనేరు శాసనసభ్యులు అమరనాథ రెడ్డి స్పష్టం చేశారు. మదనపల్లెలో జరిగిన హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాయలసీమ రైతు పండించిన పండు ప్రపంచ మార్కెట్‌కు చేరే కొత్త ఆర్థిక వ్యవస్థకు ఇది శ్రీకారం. రైతు పండించే పంటకు విలువ ఇక్కడే పెరగాలి. ఆ విలువ ప్రపంచ మార్కెట్‌కు చేరాలి…ప్రపంచ మార్కెట్‌లో రాయలసీమ పేరు నిలవాలి. ఈరోజు మనం పెట్టే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రేపు రైతు ఆదాయంగా మారాలి. ఈరోజు వచ్చే పెట్టుబడి రేపు యువతకు ఉపాధిగా మారాలి. ఇక్కడ ఏర్పాటు చేసే కోల్డ్ చైన్ ప్రాసెసింగ్ యూనిట్లు రైతుల పంటకు అదనపు ఆదాయంగా మారాలి. రాయలసీమను కరువు ప్రాంతంగా చూసిన కాలం నుంచి, ప్రపంచ స్థాయి హార్టికల్చర్ ప్రొడక్షన్ , ప్రాసెసింగ్ అండ్ ఎక్స్పోర్ట్ సెంటర్ గా గుర్తించే స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఇది. రైతు బలపడితే రాయలసీమ బలపడుతుంది రాయలసీమ బలపడితే ఆంధ్రప్రదేశ్ బలపడుతుంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, కేంద్ర ప్రభుత్వం సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ ముందడుగు ద్వారా రాయలసీమ రైతు పండించిన పంట దేశ మార్కెట్‌ను దాటి ప్రపంచ మార్కెట్‌కు చేరే పరిస్థితి రావాలని ఆకాంక్షిస్తున్నాన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!