ePaper
Tuesday, September 22, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మహిళా సాధికారతకు అడుగుజాడ గురజాడ:హెచ్.ఎం రవి

మహిళా సాధికారతకు అడుగుజాడ గురజాడ:హెచ్.ఎం రవి

📰 Generate e-Paper Clip

కార్వేటి నగరం సెప్టెంబర్ 21 (గరుడ దాద్రి న్యూస్):
మహిళా సాధికారతకు, సమాజ వికాసానికి ఆధునిక యుగ వైతాళికుడు గురజాడ అప్పారావు అడుగుజాడలు నిజమైన మార్గదర్శకాలని డీ.ఎం.పురం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవి పేర్కొన్నారు. స్థానిక డీ.ఎం.పురం ఉన్నత పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ త్యాగరాజు ఆధ్వర్యంలో, హెచ్.ఎం రవి అధ్యక్షతన గురజాడ అప్పారావు జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
​ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ, సమాజంలో మహిళల హక్కులు, గౌరవం, సమానత్వం, స్వేచ్ఛ వంటి అంశాల ఆవశ్యకతను శతాబ్దన్నర క్రితమే గురజాడ తన రచనల ద్వారా బలంగా చాటారని కొనియాడారు. “సమాజం పురోగమించాలంటే మహిళ పురోగమించాలి” అనే ఉన్నత భావజాలంతో ఆయన స్త్రీ విద్యా విముక్తి కోసం గళమెత్తారని గుర్తుచేశారు. గురజాడ రచించిన ప్రసిద్ధ ‘కన్యాశుల్కం’ నాటకం ద్వారా బాల్య వివాహాలు, పితృస్వామ్య ఆధిపత్యం వంటి సామాజిక రుగ్మతలను తీవ్రంగా నిరసించడమే కాకుండా, మహిళా చైతన్యాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రబోధించారని తెలిపారు. ​దేశమంటే కేవలం భౌగోళిక ప్రాంతం కాదని, మనుషులే దేశమని చాటిన గురజాడ, ప్రజల్లో సగభాగమైన మహిళలను గౌరవించినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారని ఉపాధ్యాయులు సరస్వతి, కలై వాణి లు వివరించారు. విద్య ద్వారానే మహిళలు సమాన హక్కులను, నిర్ణయాధికారాన్ని పొంది సాధికారత సాధించగలరని, ఆయన చూపిన అభ్యుదయ బాటలో విద్యార్థులు నడవాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా విద్యార్థులు దేశమంటే మనుషులోయ్ అంటూ భారత చిత్రపట ఆకారం లో నిల్చుని చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది.
​ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సరస్వతి, కలై వాణి, రాములు, అశోక్,హరి, రంజిత్ కుమార్ మరియ

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!