*పలమనేరు, సెప్టెంబర్ 21 ( గరుడ ధాత్రి ) :
పట్టణంలోని మీసేవ కేంద్రాల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని, దీనిపై తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ‘పలమనేరు పరిరక్షణ సమితి’ (పిపిఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం పలమనేరు ఆర్డీవో భవాని కు సమితి ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ మీసేవ నిర్వాహకులు ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ప్రతి మీసేవ కేంద్రంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించేలా కఠిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆర్డీవోను కోరారు. తద్వారా ప్రజలకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలమనేరు పరిరక్షణ సమితి అధ్యక్షుడు నరసింహులు, కార్యదర్శి నారాయణ, కోశాధికారి రామచంద్ర, సలహాదారులు శ్రీపురం సీతారామయ్య, ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, పోన్ముడి, జాయింట్ సెక్రటరీ రెడ్డప్ప నాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు విజయ్ కుమార్, సాంబయ్య, జగన్నాథం, కమిటీ సభ్యులు నాగప్ప, చంద్రశేఖరయ్య, వీరభద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మీసేవ కేంద్రాల్లో అధిక ఛార్జీలుకు అడ్డుకట్ట వేయాలిని ఆర్డీవోకు పిపిఎస్ వినతిపత్రం
RELATED ARTICLES
