ePaper
Tuesday, October 6, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్

ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్

📰 Generate e-Paper Clip

* కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.
* బుర్రిపాలెంలో 3 లక్షల ఇళ్లకు శంకుస్థాపన.
* మొక్కలు నాటిన నేతలు.
* కేంద్ర, రాష్ట్ర అధికారుల మధ్య ఎంఓయూ మార్పిడి.
చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 3 (గరుడ ధాత్రి న్యూస్): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి రాష్ట్రంగా ఎదుగుతోందని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.ఆదివారం గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర, రాష్ట్ర మంత్రులతో కలిసి పీఎంఏవై-గ్రామీణ్ 2.0లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు.సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఎదుగుతోందని ఆయన అన్నారు. ప్రస్తుతం చేపట్టిన 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోగానే మరో 3 లక్షల ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు. వాటితో పాటు మరో 3 లక్షల ఇళ్లను కూడా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని చెప్పారు.విజనరీ నేత చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీ ‘షైనింగ్ ఆంధ్ర’, ‘అడ్వాన్స్‌డ్ ఆంధ్ర’, ‘అచీవింగ్ ఆంధ్ర’గా మారుతోందని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ వంటి పుణ్యభూమికి కోటి ప్రణామాలు తెలిపారు. తాను మధ్యప్రదేశ్‌కే కాకుండా ఏపీ ప్రజలకు కూడా మామయ్యలాంటి వాడినని ఆత్మీయంగా పేర్కొన్నారు.
తెనాలి రామకృష్ణుడి ప్రతిభ గురించి చిన్నప్పటి నుంచే విన్నానని, ఈ నేల మేధస్సుకు ప్రతీక అని అన్నారు. చంద్రబాబు నాయుడు విజన్ దేశానికే దిక్సూచి అని, టెక్నాలజీతో ఆంధ్రప్రదేశ్‌ను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు. ప్రజలతో మమేకమై పనిచేయాలన్న ఆయన సంకల్పం గొప్పదని అన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముగ్గురూ ఏపీ ప్రగతికి మార్గదర్శకులని పేర్కొన్నారు.రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.6 వేలు ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.14 వేలు కలిపి మొత్తం రూ.20 వేలను ‘అన్నదాత సుఖీభవ’ కింద అందిస్తోందని తెలిపారు. ‘వీబీజీ రామ్ జీ యోజన’ ద్వారా ‘పల్లె పండుగ’ పేరిట గ్రామాల్లో డ్రెయిన్లు, రోడ్లు, కుళాయిలు తదితర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిగా సహకరిస్తుందని స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు కలిసి ఆంధ్రప్రదేశ్‌ను 360 డిగ్రీల్లో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజధాని లేకుండానే రాష్ట్రాన్ని విభజించి ఏపీని అనాథగా వదిలేసిందని విమర్శించారు. అలాంటి ఆంధ్రప్రదేశ్‌ను ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాయని అన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర అధికారులు ఎంఓయూను మార్చుకున్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన అనుమతి పత్రాన్ని కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు.
శంకుస్థాపన కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామాన్ని సందర్శించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించే లక్ష్యంతో గ్రామ ప్రాంగణంలో ఇరువురు నాయకులు మొక్కలు నాటారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.
అనంతరం గృహ నిర్మాణ రంగంలో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, పార్థసారథి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!