బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్4
బైరెడ్డిపల్లి మండల కేంద్రంలోని జామియా మసీదులో ఆదివారం జరిగిన నికాహ్ కార్యక్రమానికి పుంగనూరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
బైరెడ్డిపల్లి మండలం మేకలనాగిరెడ్డిపల్లికి చెందిన జి. షమ్షీర్ బాషా తో అన్నమయ్య జిల్లా సోమల మండలం వంగసానివారిపల్లికి చెందిన నూర్-ఇ-చేష్మి నికాహ్ ఆదివారం ఉదయం జామియా మసీదులో జరిగింది. అనంతరం బైరెడ్డిపల్లి రాయల్ మహల్‌లో ఏర్పాటు చేసిన విందులో పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి బైరెడ్డిపల్లి మండల వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మొగసాల కృష్ణమూర్తి, దయానంద గౌడ్, కేశవులు, మాజీ ఎంపీటీసీ రూపా జైకుమార్, నారాయణస్వామి స్థానిక మాజీ సర్పంచ్ బాలకృష్ణ గౌడ్ తో పాటు పలువురు ఎంపీటీసీలు,
మాజీ సర్పంచులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం విందు భోజనం స్వీకరించారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వైయస్సార్సీపివే
-రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
బైరెడ్డిపల్లి లో జరిగినటువంటి సోమల వైఎస్ఆర్సిపి నాయకుడి కుమారుడి పెళ్ళికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరైనారు. ఆయనకు మండల కార్యకర్తలు ఘనంగా ఆహ్వానం పలికారు. అనంతరం ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాబోయే స్థానిక ఎన్నికలలో అత్యధిక స్థానాలు వైయస్సార్సీపివేనని
ధీమా వ్యక్తం చేశారు.మెజారిటీ స్థానాల్లో మండలంలో కూడా తమపార్టీ నాయకుడు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి జెండా ఎగరవేయడం ఖాయం అన్నారు.
