సత్యవేడు అక్టోబర్ 02 గరుడధాత్రి
ముదిరాజ్ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా అందారి నరేంద్ర ముదిరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు ముదిరాజ్ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి కృష్ణమోహన్ ముదిరాజ్ శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
ముదిరాజ్ సంఘం ఆశయాలు, లక్ష్యాల సాధనకు కృషి చేస్తూ ముదిరాజ్ సామాజికవర్గ ప్రతిష్ఠను పెంపొందించడంతో పాటు సామాజిక అభివృద్ధి, ఐక్యత, భద్రత తదితర అంశాలపై పనిచేయాలనే ఉద్దేశంతో నరేంద్ర ముదిరాజ్‌కు ఈ బాధ్యతలు అప్పగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జిల్లాలో ముదిరాజ్ సామాజికవర్గాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు సంఘం అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని రాష్ట్ర అధ్యక్షుడు ఆకాంక్షించారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి సంఘం బలోపేతానికి కృషి చేస్తానని నరేంద్ర ముదిరాజ్ తెలిపారు.
ఈ నియామకంపై ముదిరాజ్ సంఘం నాయకులు, సామాజికవర్గ ప్రతినిధులు నరేంద్ర ముదిరాజ్‌కు అభినందనలు తెలిపారు.
