ePaper
Saturday, October 3, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివిలువలను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు మహాత్మా గాంధీ

విలువలను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు మహాత్మా గాంధీ

📰 Generate e-Paper Clip

* బీసీఎన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ బి.సి. నాగరాజ్.
* కుప్పం ఇంజినీరింగ్ కళాశాల లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు.
చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 02 ( ఆర్. శ్రీనివాసులు,గరుడ ధెస్ట్రీ న్యూస్):అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకొని కుప్పం ఇంజినీరింగ్ కళాశాల (అటానమస్) లో ప్రత్యేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బి సి ఎన్ విద్యాసంస్థల చైర్మన్ డా. బి.సి. నాగరాజ్ మాట్లాడుతూ, మహాత్మా గాంధీజీ అహింస, సత్యం, శాంతి, పరిశుభ్రత, స్వావలంబన వంటి విలువలను ప్రపంచానికి చాటిన మహనీయుడని అన్నారు. గాంధీజీ ఆశయాలను యువత తమ జీవితంలో ఆచరించినప్పుడే సమాజంలో సానుకూల మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు తరువాత అయన గాంధీజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయనకు ఘన నివాళులు అర్పించారు.వైస్ చైర్మన్ డా. ఎన్. సునీల్ రాజ్ మాట్లాడుతూ, విద్యార్థులు గాంధీజీ జీవితం, సిద్ధాంతాల నుంచి స్ఫూర్తి పొంది దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సత్యం, క్రమశిక్షణ, సేవాభావం, సామాజిక బాధ్యత వంటి విలువలను విద్యార్థుల్లో పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమములో కుప్పం ఇంజనీరింగ్ కళాశాల వైస్ చైర్మన్ డా. ఎన్. సునీల్ రాజ్, సెక్రటరీ ఎన్. సాగర్ రాజ్ ప్రిన్సిపాల్ డాఎస్. సుధాకర్ బాబు, వైస్ ప్రిన్సిపాల్ డా. ఎస్. భాస్కరన్, హ్యూమానిటీస్ అండ్ సైన్సెస్ విభాగాధిపతి జె. మాధవన్, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గంగాధరన్, డా. అరుణ్ కుమార్ వివిధ విభాగాధిపతులు, పీఆర్వో ప్రవీణ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు, వాలింటర్స్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!