ePaper
Friday, September 18, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్యువత నైపుణ్యాలను పెంచుకుని దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలి

యువత నైపుణ్యాలను పెంచుకుని దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలి

📰 Generate e-Paper Clip

పూతలపట్టు సెప్టెంబర్ 17 (గరుడదాత్రిన్యూస్)

యువత తమ నైపుణ్యాలను పెంచుకుని దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని టిడిపి పొలిటి బ్యూరో సభ్యులు, చిత్తూరు పార్లమెంటు సభ్యులు విద్యార్థులకు సూచించారు.
చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు మండలం ప్రముఖ విద్యాసంస్థ వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గురువారం విద్యార్థుల భవిష్యత్తును కాంక్షిస్తూ ‘యువత భవిష్యత్తుకు భరోసా’ అనే కార్యక్రమాన్నినిర్వహించారు.ఈ సందర్బంగా ఆ విద్యాసంస్థలో జరిగిన
యువత భవిష్యత్తుకు భరోసా’ సదస్సుకు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు

*నైపుణ్యాల అభివృద్ధి*

కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, నేటి ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థులు సరికొత్త నైపుణ్యాలను (Skills) నేర్చుకోవాలని పిలుపునిచ్చారు.
*ప్రభుత్వ అండ*:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎన్నో రకాల శిక్షణా కార్యక్రమాలను మరియు స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు.

*పరిశ్రమల స్థాపన*:

చిత్తూరు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరుగుతోందని, ఎంఎస్ఎంఈల (MSME) ద్వారా వేలాది మందికి కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని గుర్తుచేశారు.
*లక్ష్య సాధన*:
యువత తమకంటూ ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, పట్టుదలతో శ్రమిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం లో నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయాన్ని ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ నియామకాల్లో 150 కోట్లు భారీ కుంభకోణాన్ని తీవ్రంగా ఖండించారు సైతం ప్రైవేటు సంస్థలకు తరలించి 97% పైగా పత్రాలతో అనధికార దిద్దుబాటులకు పాల్పడి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న తీరును వివరించాడు ఇలాంటి అక్రమాలకు చమర గీతం పాడుతూ కూటమి ప్రభుత్వం కేవలం ప్రతిప ఆధారంగా అత్యంత పారదర్శకంగా ఎటువంటి అవకతవకలు లేకుండా ఉద్యోగ నియామకాలు జరుపుతుందని నిరుద్యోగుల కలలను నిజం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపాడు
ఈ కార్యక్రమంలో వేము విద్యాసంస్థల చైర్మన్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ నాయుడు , ప్రిన్సిపాల్ నవీన్ కిలారి అధ్యాపక బృందం విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!