బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్9.
బైరెడ్డిపల్లి పి.హెచ్.సి.లో ప్రధాన మంత్రి సురక్షిత మాతృ అభియాన్ కార్యక్రమము మహతి ఫౌండేషన్ వారి సహకారంతోమంగళవారం జరిగినది. ఈ కార్యక్రమంలో రక్త పరీక్షలు, గర్భ పరీక్షలు చేసి డాక్టర్ శాలిని, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సావిత్రి ఆరోగ్య విద్య బోధిస్తూ రక్తహీనతనివారణ కొరకు పోషకాహారం అవశ్యం అన్నారు వ్యక్తిగత శుభ్రత చేతులు శుభ్రతపాటించాలని, హై రిస్క్ గర్భవతుల సేవలు, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని తెలిపారు . ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు చేసుకోవాలని ,తల్లిపాలు కుటుంబ నియంత్రణ ప్రాముఖ్యత మరియు ధ్యానం ,యోగ చేసుకోవడం వలన మానసిక శారీరక ఆరోగ్యం పెంపొందించుకోవచ్చని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో సూపర్వైజర్లు ఏఎన్ఎంలు ఆశాలు తదితరులు పాల్గొన్నారు.అలాగే మండలం లోని తీర్థం పి హెచ్.సి.లో కూడా ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమము
వైద్యాధిలకారిణి సుస్మిత ఆధ్వర్యంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నెలనెలా రెగ్యులర్ గా చెకప్ ,రక్త పరీక్షలు చేయీంచు కోవాలని ,అవసరం అయితే స్కానింగ్ చేయించు కోవాలి అన్నారు. మంచి పౌష్టిక ఆహారం విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు . డిప్యూటీ హె చ్ఈ ఒ కాంతమ్మ మాట్లాడుతూ 108,102, వినియోగాల గురించి సురక్షిత మైన కాన్పు కోసం ఆసుపత్రిలో కాన్పులు కావాలని కాన్పు కు కాన్పుకు మధ్య ఎడం ( దూరం ) ఉండాలని,కాన్పు అయిన తర్వాత పిల్లలకు ఇచ్చే టీకాలయొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. . గర్భవతులు, బాలింతలు యోగ , మెడి టేషన్ లాంటి వి చేయాలని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిహెచ్ న్ శమంతక, హరిప్రసాద్, రాజారెడ్డి,ఏ..ఎన్. ఎం. లు, ఆశాలు, గర్భవతులు తదితరులు పాల్గొన్నారు.
