రామగిరి అడవిలో గుర్తుతెలియని వృద్ధ మహిళ శవం లభ్యం

మండలంలోని రామగిరి వా లీ శ్వర స్వామి దేవాలయానికి పక్కనే ఉన్న ఎస్టీ కాలనీ నుండి రామగిరి అడవికి వెళ్లే అటవీ మార్గంలో గుర్తుతెలియని వృద్ధ మహిళ శవాన్ని ఉపాధి పనులకు లకు వెళ్లే కూలీలు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై రాఘవ తన సిబ్బందితో కలిసి అటవీ ప్రాంతానికి వచ్చి సంఘటన స్థలానికి చేరుకుని శవం యొక్క స్థితిగతులను పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో ప్రాంతంలో ఆకుల కోసం వచ్చి ఎండ వేడిమికి తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయి చనిపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తపరిచారు. చనిపోయిన వృద్ధ మహిళపరిసర ప్రాంతాలకు చెందినదిగానే ఉండవచ్చు అన్నారు. చనిపోయి రెండు రోజులు కావస్తుండడంతో శవం పూర్తిగా ఆచూకీ కి కనుగొనడం కష్టంగా మారిందన్నారు. దుస్తులను బట్టి శవం ఆనవాలు బంధువులు గుర్తించవచ్చని వివరించారు. ఫోటో మహిళ శవం కోసం అటవీ ప్రాంతాల్లో ప్రయాణిస్తున్న ఎస్ఐ రాఘవేంద్ర
రామగిరి అడవిలో మృతి చెంది ఉన్న వృద్ధ మహిళ
