ePaper
Tuesday, September 22, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్రాయలసీమ జిల్లాలను కరువు జిల్లాలుగా ప్రకటించాలి - ఏఐకేఎంఎస్ డిమాండ్

రాయలసీమ జిల్లాలను కరువు జిల్లాలుగా ప్రకటించాలి – ఏఐకేఎంఎస్ డిమాండ్

📰 Generate e-Paper Clip

సత్యవేడు సెప్టెంబర్ 20 గరుడధాత్రి న్యూస్ :

రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయ రంగం పూర్తిగా చిన్నాభిన్నమైందని, కరవుతో కుదేలవుతున్న రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, పశుపోషకులను ప్రభుత్వం తక్షణమే అత్యవసర చర్యల ద్వారా ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం( ఏఐకేఎంఎస్ )తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి దేశాండీ అరుణాచలం పత్రిక ప్రకటన ద్వారా ప్రభుత్వాన్ని కి విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తీవ్రమైన కరవు పరిస్థితులపై , అత్యవసరంగా కరవు నివారణ సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసారు.

జూన్ 1 నుంచి సెప్టెంబర్ 12 వరకు రాష్ట్రంలో సాధారణంగా 476.1 మి.మీ. వర్షపాతం నమోదు కావలసి ఉండగా, కేవలం 218.2 మి.మీ. మాత్రమే నమోదైందని, ఏకంగా 54.2 శాతం భారీ వర్షపాతం లోటు ఏర్పడిందని . రాష్ట్రంలో సాధారణ ఖరీఫ్ సాగు లక్ష్యం సుమారు 77.5 లక్షల ఎకరాలు కాగా, వర్షాభావం వల్ల ఇప్పటివరకు కేవలం 65 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తుందిఅని తెలియజేసారు.

ఎకరాకు రూ.15,000 నుండి రూ.20,000 వరకు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పండించిన పత్తి, కంది, వేరుశనగ, మొక్కజొన్న, చీనీ తోటలు నీరు లేక కళ్లముందే వాడిపోయి పూర్తిగా ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సుమారు రూ.5.40 లక్షల కోట్ల మేర పంట నష్టం వాటిల్లిందని ఆయన వెల్లడించారు. భూగర్భజలాలు అడుగంటి పోవడంతో బోర్లు పనిచేయక గ్రామాల్లో తాగడానికి మంచి నీరు కూడా లభించని పరిస్థితి నెలకొందన్నారు. లక్షలాది రూపాయల విలువైన పాడి పశువులను పోషించలేక, నీరు, పశుగ్రాసం అందుబాటులో లేకపోవడంతో రైతులు, పశుపోషకులు వాటిని తక్కువ ధరలకే విక్రయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు. ప్రభుత్వ అధికారిక సమీక్ష ప్రకారం 284 మండలాల్లో 2,44,443 హెక్టార్లలో పంటలు వర్షాభావ ప్రభావానికి గురయ్యాయని, ఇందులో 1,92,387 హెక్టార్లు తేమ ఒత్తిడికి, 41,474 హెక్టార్లు వాడిపోయే పరిస్థితికి, 10,582 హెక్టార్లు పూర్తిగా ఎండిపోయే పరిస్థితికి గురైనట్లు చెబుతున్నారని పేర్కొన్నారు.
అయితే ఈ గణాంకాలు క్షేత్రస్థాయిలోని వాస్తవ భయానక పరిస్థితిని పూర్తిగా ప్రతిబింబించడం లేదని విమర్శలు చేసారు.
రాష్ట్రంలోని 28 జిల్లాల్లోనూ వర్షపాతం లోటు ఉత్సహకరంగా లేదని, మొత్తం 688 మండలాలకు గాను 665 మండలాల్లో కరవు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని స్పష్టం చేశారు. ఇలాంటి తీవ్ర సంక్షోభంలో “వరికి బదులు ఆరుతడి పంటలు వేసుకోండి” అంటూ నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల కింద రైతులకు ఉచిత సలహాలు ఇవ్వడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని మండిపడ్డారు. సాగు ప్రారంభమైన తరువాత నీటి కొరత ఏర్పడినప్పుడు దాని భారాన్ని రైతులపైకి నెట్టడం సరికాదని, ప్రభుత్వం కేవలం సమీక్షలకే పరిమితం కాకుండా తక్షణమే కరవు ప్రభావిత మండలాలను శాస్త్రీయంగా ప్రకటించి కార్యాచరణలోకి దిగాలని డిమాండ్ చేశారు.

. కూటమి ప్రభుత్వం స్పందించి వెంటనే నివారణ చర్యలు తీసుకోకుంటే అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున ప్రజలను సమీకరించి దశలవారీగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!