ePaper
Tuesday, September 22, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్స్థానిక ఎన్నికల్లో కూటమి విజయానికి సమష్టిగా కృషి చేయాలి - గంగా ప్రసాద్

స్థానిక ఎన్నికల్లో కూటమి విజయానికి సమష్టిగా కృషి చేయాలి – గంగా ప్రసాద్

📰 Generate e-Paper Clip

టీడీపీ–జనసేన–బీజేపీ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగాలి.. సత్యవేడులో గ్రామస్థాయి నుంచి కూటమిని బలోపేతం చేయాలి

సత్యవేడు సెప్టెంబర్ 20 గరుడధాత్రి న్యూస్ :

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో సమష్టిగా కృషి చేయాలని ప్రముఖ పారిశ్రామికవేత్త, సీనియర్ టీడీపీ నాయకుడు కొండేపాటి గంగా ప్రసాద్ పిలుపునిచ్చారు. సత్యవేడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు చెన్నైలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సూచనల మేరకు జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు.

గంగా ప్రసాద్ కీలక సందేశంబ:

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ సూచనల మేరకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సమన్వయంతో కూటమి శ్రేణులు ముందుకు సాగాలని గంగా ప్రసాద్ సూచించారు. స్థానిక ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని గ్రామస్థాయి నుంచి కూటమి శ్రేణులను సమన్వయం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

– స్థానిక ఎన్నికల్లో కూటమి విజయానికి సమష్టి కార్యాచరణ
– టీడీపీ–జనసేన–బీజేపీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం
– అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ గ్రామస్థాయి నుంచి కూటమి బలోపేతం చేయాలని ప్రధానంగా పేర్కొన్నారు.

కూటమిలోని మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను గౌరవిస్తూ అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని గంగా ప్రసాద్ స్పష్టం చేశారు. స్థానికంగా ఉన్న సమస్యలను సమన్వయంతో పరిష్కరించుకుంటూ, ప్రజలతో మమేకమై ఎన్నికలకు సిద్ధం కావాలని కోరారు.

ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేసి స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సత్యవేడు నియోజకవర్గంలో కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నాయకులు ‘జై తెలుగుదేశం.. జై జై తెలుగుదేశం’ అంటూ నినాదాలు చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!