*రూ.108 కోట్లతో చేపట్టిన ఆర్డీఎస్ఎస్ పనులు సెప్టెంబర్ లోపు పూర్తి*
*ప్రతి పల్లెకు ఆటంకాలు లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా*
*వైసీపీ పాలనలో పనులు తక్కువ- ప్రచారం ఎక్కువ*
*పద్దతి, పాడు లేకుండా కోట్ల రూపాయలతో సవిటి కాలువలు కట్టి ప్రజాధనం వృథా చేశారు*
*మేం అనుక్షణం పేదల కోసం తపిస్తుంటే వైసీపీ నేతలు మాత్రం ఇరిగేషన్ బిల్లులు దండుకోవడంలో ఆరితేరారు*
*మనుబోలు మండలం లక్ష్మీనరసాపురంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*రూ.1 కోటితో పూర్తి చేసిన త్రీఫేస్ విద్యుత్ లైన్లు ప్రజలకు అంకితం*
*రూ.15 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్ల ప్రారంభోత్సవం*
*సోమిరెడ్డి కామెంట్స్*
ఆర్డీఎస్ఎస్ లో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా రూ.108 కోట్లతో త్రీఫేస్ లైన్ పనులు జరుగుతున్నాయి
ఓల్టేజీ హెచ్చుతగ్గులు లేని నాణ్యమైన విద్యుత్ నిరంతర సరఫరా కోసం లక్ష్మీనరసాపురంలో రూ.1 కోటితో పనులు పూర్తి చేశారు
ఆరు కొత్త ట్రాన్స్ ఫార్మర్లు, 183 స్తంభాలతో 3.5 కిలోమీటర్ల మేర కొత్త లైను ఏర్పాటు చేశారు
ఇకపై గ్రామంలో విద్యుత్ కోతల సమస్య పరిష్కారం కావడంతో పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుంది
సర్వేపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఆర్డీఎస్ఎస్ పనులను సెప్టెంబర్ లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం
కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి పరుగులు పెడుతోంది
కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టిన ఆర్డీఎస్ఎస్ పనులు గత ప్రభుత్వ పాలనలోనే మంజూరయ్యాయి
వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల చేయకపోవడంతో పనులు ముందుకు సాగలేదు
ఏ శాఖ పని ఆ శాఖ చేసుకునిపోయే పరిస్థితులు గతంలో లేవు
కీలకమైన వ్యవస్ధలను, శాఖలను కుప్పకూల్చారు
డ్రైనేజీ కాలువలు కట్టి ప్రారంభించిన మనుషుల కంటే ఎత్తైన శిలాఫలకాలు వేసుకున్నారు
ఏ ఊరికి వెళ్లినా ముందు సవిటి కాలువల శిలాఫలకాలే దర్శనమిస్తున్నాయి..ఆ కాలువల్లో మాత్రం మురుగు ముందుకు కదిలే పరిస్థితి కనిపించడం లేదు
ఒక్క నుడా నిధులే రూ.26 కోట్లతో కాలువలు నిర్మిస్తే ఒక్క కాలువలోనూ పారుదల లేదు
ఆ ఐదేళ్లు పనులు తక్కువ.. పబ్లిసిటీ ఎక్కువలా సాగింది
మేం మాత్రం పబ్లిసిటీ లేకుండా ప్రజలకు అవసరమైన పనులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం
వైసీపీ పాలనలో ఇరిగేషన్ పనులు చేయకుండా బిల్లులు చేసుకున్నారు..ఇప్పుడేమో కోర్టుల్లో కేసులు వేసి బిల్లులు తెచ్చుకుంటున్నారు
కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఒక్క డీఈ పరిధిలోనే రూ.15 కోట్లు బిల్లులు చేసుకునివున్నారు..మిగిలిన డీఈల పరిధిలో లెక్కలు తీస్తే ఇంకెన్ని కోట్లు వస్తాయో
పేదలకు సాయం చేసే ప్రయత్నంలో మేముంటే వాళ్లేమో అడ్డగోలుగా బిల్లులు తెచ్చుకోవడంలో ఆరిపోయారు
కందలపాడులో గ్రావెల్ మైనింగ్ కు అనుమతులు ఏ ప్రభుత్వంలో ఎవరిచ్చారు
ప్రభుత్వ పనులకు గ్రావెల్ ఎక్కడి నుంచి తీసుకురావాలో కాకాణే చెప్పాలి
పేదలు ఎవరైనా ఇంటికి నాలుగు ట్రిప్పులు తోలుకుంటే సోమిరెడ్డి దోపిడీ అంటూ గావు కేకలు పెడతాడు
మేము కాకాణి మాదిరిగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకం ఫోర్జరీ చేసి దోపిడీలు చేయడం లేదు
అప్పట్లో కేవలం రూ.1 చెల్లించి వందల కోట్ల విలువైన గ్రావెల్ దోపిడీకి పాల్పడ్డారు
ఇప్పుడు ప్రభుత్వ అనుమతులతో నడుస్తున్న మైన్ లో సీనరేజీ చెల్లించి గ్రావెల్ తీసుకెళుతుంటే కాకాణికి అంత కడుపు మంట ఎందుకో
లీజు ఉన్న మైన్ మూసేస్తే ప్రభుత్వ, ప్రజాపయోగ అవసరాలకు గ్రావెల్ ఎక్కడి నుంచి తేవాలో ఆయనే చెప్పాలి








