ePaper
Tuesday, June 23, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్విభేదాలు వీడి స్థానిక సంస్థ ఎన్నికల్లో సత్తా చాటుకుందాం కోనేటి సుమన్ కుమార్

విభేదాలు వీడి స్థానిక సంస్థ ఎన్నికల్లో సత్తా చాటుకుందాం కోనేటి సుమన్ కుమార్

📰 Generate e-Paper Clip

నాగలాపురం,గరుడ దాత్రి న్యూస్ :

త్వరలో జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో గ్రూపులు వీడి అందరు కలిసికట్టుగా పనిచేసి ఎంపిటిసిలు సర్పంచులు జడ్పిటిసి ఎంపీపీలను కైవసం చేసుకోవాలని సత్య వేడు నియోజకవర్గం బి ఎల్ ఏ మరియు ఉమ్మడి జిల్లా ఫైనాన్స్ కమిటీ మెంబర్ కోనేటి సుమన్ కుమార్ అన్నారు సోమవారం నాగలాపురం మండల కేంద్రంలోని మండపంలో మండల బిఎల్ఎ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న సుమన్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయి నుండి మండల స్థాయి వరకు గ్రూపులు ఉంటే వీడి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి అందరూ ఏకతాటిపై నిలిచి ఎంపిటిసి సర్పంచులు ఎంపీపీ జడ్పిటిసి స్థానాలను కైవసం చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు లోకేష్ కు కానుకగా అందించాలని ఆయన అన్నారు మనమందరం ఒకే కుటుంబ సభ్యులుగా ఉండాలన్నారు ఎక్కడ ఎమ్మెల్యే వర్గం హేమలత వర్గం కోఆర్డినేటర్ వర్గం అని తేడా లేకుండా పార్టీ ఆదేశాలు కట్టుబడి అందరం ఒకే తాటిపై నిలిచే ముందుకు రావాలని ఆయన నాయకులకు కార్యకర్తలకు సూచించారు ఈ సందర్భంగా నాగలాపురం మండలానికి వచ్చిన కోనేటి సుమన్ కుమార్ కు నాగలాపురం మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికి పూలమాలశాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంపిటిసి ప్రేమ సెల్వకుమార్ మాజీ ఎంపీపీ మురళి ఎస్ ఎం సురేష్ రాజమాణిక్యం మహేష్ పరశురాం శిల్పి నాగయ్య పలని మరియు మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!