ePaper
Monday, October 5, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివృద్ధాప్యం అనివార్యం.. పెద్దలను ప్రేమిద్దాం -డాక్టర్ విజయ చందర్

వృద్ధాప్యం అనివార్యం.. పెద్దలను ప్రేమిద్దాం -డాక్టర్ విజయ చందర్

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్1

ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ,””వృద్ధాప్యం అనివార్యం పెద్దలను ప్రేమిద్దాం””అని బైరెడ్డిపల్లి పి.హెచ్.సి.వైద్యాధికారి విజయ చందర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ సభ్యుల ఆప్యాయత, తప్పనిసరి మన బాధ్యత కుటుంబ పెద్దల ప్రేమ ,అనుభవం సహాయ సహకారం మనకు వరం అన్నారు. క్రమం తప్పకుండా వ్యాయాయం, నడక, యోగా వంటివి చేయాలని కుటుంబం, స్నేహితులు మరియు సామాజిక సమూహాలతో చురుకుగా ఉండాలని, పండ్లు కూరగాయలు మరియు ధాన్యాలతో కూడిన ఆహారం తీసుకోవాలనిపేర్కొన్నారు డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సావిత్రి మాట్లాడుతు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేసుకోవాలని, ఒత్తిడిని తగ్గించు కొనుటకు విశ్రాంతి ధ్యానం ,నడక భక్తి కి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనాలన్నారు.
ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు,సిహెచ్ వోలు ,ఏ.ఎన్. ఎం. లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే మండలం లోని తీర్థం పి.హెచ్ సి.వైద్యాధికారిణి
సుస్మిత ఆద్వర్యంలో తీర్థం గ్రామంలో గురువారం అంతర్జాతీయ వృద్ధ ల దినోత్సవం సందర్భంగా అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ హెచ్.ఈ.ఓ.కాంతమ్మ మాట్లాడుతూ పెద్దలను గౌరవించాలని, ప్రేమగాచుడాలని ఎక్కువ మానసిక వత్తిడి తీసుకోరాదని, నెలనెలా ఆరోగ్య పరీక్షలు చేయించు కోవాలని మంచి పౌస్టిక ఆహారం మరియు శాకా హారం పండ్లుతీసుకోవాలని, వీలైనంత వరకు మెడిటేషన్,మరియునడక లాంటివి చెయ్యాలని, ఇంటి లోని వ్యక్తులు ప్రేమను పంచాలని చెప్పడం జరిగింది.
ఈ కార్య క్రమంలో ఆశ శాంతమ్మ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!