ePaper
Sunday, October 4, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిశ్రీ కళ్యాణవెంకటరమణ స్వామి, శ్రీనల్గొండ్రాయస్వామికి ప్రత్యేక పూజలు

శ్రీ కళ్యాణవెంకటరమణ స్వామి, శ్రీనల్గొండ్రాయస్వామికి ప్రత్యేక పూజలు

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్3

బైరెడ్డిపల్లి మండలంలోని బేలుపల్లి గ్రామ పంచాయితీ పట్నపల్లి లో వెలిసివున్న ప్రముఖ
శ్రీకళ్యాణవెంకటరమణస్వామి ఆలయంలో పరటాసి తమిళ శనివారం సందర్భంగా స్వామి మూలవర్లకు పంచామృత అభిషేకం ను అర్చకులు సుస్వరం మురళీకృష్ణమాచార్యులు,శ్రీనివాసాచార్యులు బృందంచే కొనసాగింది.అనంతరం స్వామి,ఉభయదేవేర్లు ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలు, వివిధ ఆభరణాలను, సుగంధ పుష్పాలు అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే మండలం లోని కడపనత్తం గ్రామంలోని శ్రీ నల్గొండ్రాయస్వామి ఆలయంలో కూడా శనివారం అభిషేకం ,ప్రత్యేక పూజలు ను అర్చకులు రామకృష్ణమాచార్యులు చే కొనసాగింది.భక్తులు 3వపరిటాసి శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!